Andhra Pradesh: వైసీపీలో అనిల్ కుమార్ వ్యాఖ్యలు కలకలం.. వెన్నుపోటుదారుల హిస్టరీ త్వరలోనే బయటపెడతానన్న మాజీ మంత్రి..
అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు నెల్లూరు వైసీపీలో కలకలం రేపుతోంది. పేర్లు చెప్పకుండా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు చేయడంతో టీడీపీతో టచ్ లో ఉన్న వైసీపీ నాయకులు ఎవరనే దానిపై ..
Andhra Pradesh: మాజీ మంత్రి, నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆయన.. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. ఓ నాయకుడు వైసీపీలోనే ఉంటూ సొంతపార్టీకి అన్యాయం చేస్తున్నాడంటూ విమర్శించారు. నీతిమాలిన పనులు చేస్తూ.. టిడిపికి కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నాయకులతో నిత్యం చర్చలు జరుపుతున్న వారి లిస్ట్, ఫోస్ కాల్ హిస్టరీ తన దగ్గర ఉందని.. ఆధారాలు అన్నింటిన్ని త్వరలోనే బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు నెల్లూరు వైసీపీలో కలకలం రేపుతోంది. పేర్లు చెప్పకుండా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు చేయడంతో టీడీపీతో టచ్ లో ఉన్న వైసీపీ నాయకులు ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన తొలి కేబినేట్ లో అనిల్ కుమార్ యాదవ్ కి జలవనరుల శాఖ మంత్రిగా అవకాశమిచ్చారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో అనిల్ కుమార్ కు ఉద్వాసన పలికి.. అదే జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పిచారు. ఆతర్వాత నుంచి నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్థన్, అనీల్ కుమార్ యాదవ్ కు పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ కుమార్ కూడా బహిరంగంగానే కాకాణి గోవర్థన్ రెడ్డిపై విమర్శలు చేయడం.. ఆతర్వాత పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరి నేతలతో మాట్లాడి తగదాలు లేకుండా కలిసి పనిచేయాలని సూచించారు. ఆతర్వాత కొద్ది రోజులు కూల్ గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. తాజాగా నెల్లూరులో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అలాగే త్వరలోనే పార్టీలో ఉంటూ పార్టీకి వెన్ను పోటు పొడిచే వారి పేర్లు బయటపెడతానని చెప్పడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాల్లో ఈఅంశం హట్ టాపిక్ అయింది. అనిల్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుదనేది వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..