YCP Bus Yatra: రెండో రోజుకు చేరిన సామాజిక సమరభేరి యాత్ర.. నేడు మొదలయ్యేది ఎక్కడంటే?

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 11:50 AM

ఇవాళ విశాఖ నుంచి సామాజిక సమరభేరి యాత్ర కొనసాగనుంది. మంత్రులు సాయంత్రానికి రాజమండ్రికి చేరుకుని అక్కడ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

YCP Bus Yatra: రెండో రోజుకు చేరిన సామాజిక సమరభేరి యాత్ర.. నేడు మొదలయ్యేది ఎక్కడంటే?
Ycp Bus Yatra
Follow us on

YCP Bus Yatra: YCP చేపట్టిన మ౦త్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండవ రోజు విశాఖ నుంచి ప్రారంభం కాను౦ది. ఉదయం 9 గంటలకు పాత గాజువాక వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి యాత్ర మొదలుపెడతారు. 10.15 గంటలకు లంకాల పాలెం జంక్షన్.. 10.45 గంటలకు అనకాపల్లి బై పాస్..11.15 గంటలకు తాల్ల పాలెం జంక్షన్.. 11.45 గంటలకు యలమంచిలి జంక్షన్.. వరకు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు నక్క పల్లి.. 12.45 గంటలకు తుని.. 1.15 నిముషాలకు అన్నవరం చేరుకుంటారు. అక్కడ మంత్రులు భోజనం చేస్తారు. 2.30కి జగ్గం పేట.. 4.30 కి రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ చేరుకుంటారు.

BC, SC, ST, మైనార్టీ మంత్రులు, MLAలు, MPలు, MLCలు రెండు బస్సుల్లో యాత్ర మొదలుపెట్టారు. ఈమేరకు మంత్రి బొత్స మాట్లాడుతూ, ఆనాడు వైఎస్‌, ఇప్పుడు జగన్‌ హయాంతోనే సామాజిక విప్లవం వచ్చిందన్నారు. ఇక మరో మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ, ఏపీలో సామాజిక న్యాయం అమలవుతోందన్నారు. దాన్ని అందరికీ వివరించడమే బస్సు యాత్ర లక్ష్యం అన్నారు.

అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీ వర్గాలకు YCP ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. విశాఖ జిల్లాలో కొనసాగనున్న బస్సు యాత్రను విజయవ౦త౦ చేయాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి