YSRCP: ఏపీలో 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ.. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ..

వై నాట్‌ 175  నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ.  గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌. ఈ నెల 25న భీమిలిలో తొలి రీజినల్‌ క్యాడర్‌ సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే  అసెంబ్లీ, లోక్‌సభకు సంబంధించి  59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా మార్పులు తెరపైకి వచ్చాయి. 

YSRCP: ఏపీలో 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ.. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ..
CM YS Jagan
Follow us
Srikar T

|

Updated on: Jan 13, 2024 | 8:52 AM

వై నాట్‌ 175  నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ.  గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌. ఈ నెల 25న భీమిలిలో తొలి రీజినల్‌ క్యాడర్‌ సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే  అసెంబ్లీ, లోక్‌సభకు సంబంధించి  59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా మార్పులు తెరపైకి వచ్చాయి.  వైసీపీ హైకమాండ్‌ ఆదేశాల మేరకు  ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జ్‌ల పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా   విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి కార్పొరేటర్లను పరిచయం చేశారు వెల్లంపల్లి. ఉదయభాను,అవినాష్‌, రుహుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా నియమితులైన వెల్లంపల్లి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరుకాలేదు. సెంట్రల్ ఇన్‌ఛార్జ్‌గా వెల్లంపల్లిని నియమించడంపై మల్లాది అసంతృప్తిగా వున్నారా?  వెల్లంపల్లికి సహకరించాలని..అధిష్ఠానం చెప్పినా  సరే మల్లాది గైర్హాజరు కావడం చర్చగా మారింది. విజయవాడలో ఇతర నేతలను కూడా ఆయన కలవలేదు. వెల్లంపల్లి, కేశినేని నాని భేటీలకు దూరంగా వున్నారు మల్లాది విష్ణు. ప్రకాశం జిల్లా కొండపిలో మంత్రి సురేష్‌కి ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. కొండపి ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన సురేష్ పరిచయ కార్యక్రమానికి రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, జూపూడి ప్రభాకర్‌, వేమూరు ఇన్‌చార్జి వరికూటి అశోక్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కానీ జిల్లాలో కీలక నేత అయిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు కొండపి మాజీ ఇన్‌ఛార్జ్ మాదాసి వెంకయ్య కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఒంగోలులో సంతనూతలపాడులో నూతన ఇన్‌చార్జ్‌  మేరుగు నాగార్జున పరిచయకార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా స్థానిక వైసీపీ నేతలందరూ పాల్గొన్నారు. ఐతే  సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఈ కార్యక్రమానికి  రాకపోవడం సంచలనం రేపింది. సుధాకర్‌బాబుపై అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారాయన. గెలుపు లక్ష్యంగా వైసీపీ హైకమాండ్‌ వ్యూహాలకు పదను పెడుతోంది. ప్రచారపర్వానికి ముందే పరిచయ కార్యక్రమాలతో కొత్త ఇన్‌చార్జ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్తోంది వైసీపీ. అక్కడక్కడ అలకలు,అసంతృప్తులున్నా అవేం పెద్ద సమస్య కాదంటోంది వైసీపీ హైకమాండ్‌ . రీజినల్‌ వైజ్‌గా నిర్వహించే క్యాడర్‌ సమావేశాలతో అన్నీ సెట్‌రైట్‌ అవుతాయని భావిస్తున్నారు వైసీపీ నేతలు. అలకలు, ఆవేదనలు తాత్కాలికమే  కలిసి కట్టుగా వై  నాట్‌ 175 నినాదాన్ని నిజం చేయడమే లక్ష్యమంటున్నారు.

ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..