Vote Politics: ఏపీ నకిలీ ఓట్ల వ్యవహారంలో ఎవరి వాదనలెలా..

టార్గెట్‌ 2024.. ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. పొలిటికల్‌ టూర్స్‌ అల్రెడీ రోడ్డెక్కాయి. వేడిలో వాడిగా నకిలీ ఓట్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫేక్‌ ఓట్లపై పొలిటికల్‌ షూట్‌ ఔట్‌ ఎప్పటి నుంచే నడుస్తోంది. వైసీపీ- టీడీపీ పోటాపోటీగా ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల రెండు పార్టీలు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లేంట్‌ ఇచ్చాయి. ఈసీసీ ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సంఘం ఓట్ల నమోదు, తొలగింపు , బోగస్‌ ఓట్లపై ఈసీ ఫోకస్‌ పెట్టింది.

Vote Politics: ఏపీ నకిలీ ఓట్ల వ్యవహారంలో ఎవరి వాదనలెలా..
Ycp And Tdp Have Complaint To The Ec About The List Of Voters In Andhra Pradesh

Updated on: Nov 08, 2023 | 9:00 PM

టార్గెట్‌ 2024.. ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. పొలిటికల్‌ టూర్స్‌ అల్రెడీ రోడ్డెక్కాయి. వేడిలో వాడిగా నకిలీ ఓట్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫేక్‌ ఓట్లపై పొలిటికల్‌ షూట్‌ ఔట్‌ ఎప్పటి నుంచే నడుస్తోంది. వైసీపీ- టీడీపీ పోటాపోటీగా ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల రెండు పార్టీలు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లేంట్‌ ఇచ్చాయి. ఈసీసీ ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సంఘం ఓట్ల నమోదు, తొలగింపు , బోగస్‌ ఓట్లపై ఈసీ ఫోకస్‌ పెట్టింది. కొన్ని చోట్ల కొందరు అధికారులపై చర్యలు కూడా తీసుకుంది. గత నెల 21 నుంచి ఇంటింటి సర్వే చేపట్టింది అధికార యంత్రాంగం. సరైన ఆధారాలు ఉంటే తొలగించిన ఓట్లను మళ్లీ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. డోర్‌ టు డోర్‌ వైరిఫై ప్రక్రియ ముగిశాక గత నెల 27న డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాను విడుదల చేశారు సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా.

ఇప్పుడు నకలి ఓటర్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని టీటీడీ నేతలు రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వారి పేర్లను ఓటర్‌ లిస్ట్‌ తొలగించడం లేదన్నారు. దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కు మూడు చోట్ల ఓట్లు ఉండడమే అవతవకలకు నిదర్శనమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాలో చెట్టుకు, పుట్టకు కూడా చోటు ఇస్తారన్నారు టీడీపీ విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా.

అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతుంది. టీడీపీ హయాంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటున్నారు వైసీపీ నేతలు. అప్పటి అక్రమాల ప్రక్షాళన ఇప్పుడు జరుగుతుందన్నారు. పారదర్శకంగా జరుగుతున్న ప్రక్రియపై రాజకీయ లబ్ది కోసం బురద చల్లుతుందని విమర్శించారు YCP ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఓటర్ల జాబితాల అవకతవకలను అరికట్టేంత వరకు టీడీపీ పోరాడుతుందన్నారు అచ్చెన్నాయుడు. ఎక్కెడెక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయో అన్ని వివరాలను త్వరలోనే బయటపెడుతామన్నారు. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలన్నారు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ. టీడీపీతో పాటు వైసీపీ కూడా పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తున్న స‌మ‌యంలో ఓట‌ర్ జాబితా అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..