AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide: నెల్లూరులో దారుణం.. పిల్లలతో కలిసి నిప్పంటిచుకున్న మహిళ.. తల్లీ, కూతురు మృతి

Mother, Daughter killed: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకోని ఆత్మహత్యాయత్నం

Suicide: నెల్లూరులో దారుణం.. పిల్లలతో కలిసి నిప్పంటిచుకున్న మహిళ.. తల్లీ, కూతురు మృతి
Suicide
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2021 | 9:07 AM

Share

Mother, Daughter killed: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకోని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను కూడా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. అయితే.. నిప్పు పెట్టుకోవడాన్ని చూసిన కుమారుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులకు ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

కాగా ఆ మహిళ ఇద్దరు పిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు బళ్లారి నుంచి వచ్చిన బస్సులో నెల్లూరు పాలెం సెంటర్లో దిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కుమారుడు మహేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:

Theif: సారీ.. అవి కరోనా వ్యాక్సిన్లు అని తెలియదు.. లెటర్ రాసి.. టీకాలను తిరిగిచ్చేసిన దొంగ..

Ex MLA Kethiri Sai reddy:హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత.. గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్