AP: బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంతకీ తిరిగిరాలేదు.. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా షాక్
గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. గ్రామ శివార్లలోకి వెళ్లి వెతకగా....
Andhra Crime News: ఏపీలో పోలీసు ఇంకాస్త యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం ప్రతిపక్షాలు అతి చేస్తున్నాయని.. అధికార వైసీపీ ఆరోపిస్తున్నప్పటికీ.. అసలు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత కనిపిస్తుంది. ఎందుకుంటే గత 10 రోజుల వ్యవధిలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన ఘటనలు చాలా వెలుగుచూశాయి. తాజాగా మరో మహిళ మర్డర్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. శ్రీ సత్యసాయి జిల్లా(Sathya Sai district ) కనగానపల్లి మండలం కొండపల్లి(Kondapalli)లో మహిళ దారుణ హత్యతు గురైంది. గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన మహిళ తలపై బండరాయితో మోది కిరాతకంగా అంతమొందించారు. ఈ దాడితో తల భాగం గుర్తుపట్టలేనంత దారుణంగా ఛిద్రమైంది. మహిళ బహిర్భూమికి వెళ్లి ఎంతకీ తిరిగా రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు గాలించేందుకు వెళ్లారు. అక్కడ వారికి ఈ దారుణ దృశ్యం కనిపించింది. గ్రామ శివార్లలోనే ఆమె డెడ్‌బాడీగా కనిపించింది. హత్య చేశారా లేక అత్యాచారం చేసి చంపేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధర్మవరం డీఎస్పీతోపాటు కనగానపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు క్లూస్ టీమ్ రంగంలోకి దించి.. నిందితుల కోసం వేట మొదలెట్టారు. బంధువులు, స్థానికులు నుంచి వివరాలు సేకరిస్తున్నారు.