Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ.. జనసేనాని ఫిక్స్ అయ్యారా..!

రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్న తెలుస్తోంది. అంతేకాదు.. పోయిన చోటే వెదుక్కోమన్న పెద్దల సామెతను అనుసరిస్తూ.. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తాను గతంలో ఓడిపోయిన ఓ ప్లేస్ ను పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ.. జనసేనాని ఫిక్స్ అయ్యారా..!
Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2022 | 1:52 PM

Pawan Kalyan: 2014 ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని(Janasena party) స్థాపించినా.. అప్పటి ఎన్నికల్లో పోటీకి వెళ్ళలేదు. టీడీపీ (TDP), బీజేపీకి(BJP) తన మద్దతు ప్రకటించారు. అయితే గత ఎన్నికల్లో ఏపీలో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే.. ఒక్క రాజోలు నియోజవర్గం మినహా అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం సహా అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన. గత మూడేళ్ళుగా ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ.. తన గళం వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు అండగా నిలబడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు.. అయితే రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్న తెలుస్తోంది. అంతేకాదు.. పోయిన చోటే వెదుక్కోమన్న పెద్దల సామెతను అనుసరిస్తూ.. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తాను గతంలో ఓడిపోయిన ఓ ప్లేస్ ను పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుండే పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ పశ్చిమ గోదావరి  జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు స్వయంగా వెల్లడించారు. ఈ నెల 17 న పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. జనసేన జనవాణి కార్యక్రమం ఆనంద పంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకూ పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి  అర్జీలు స్వయంగా స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ ని  కలసి ప్రజలు వారి సమస్యలను స్వయంగా వివరించవచ్చని గోవిందరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..