
నంద్యాల, సెప్టెంబర్ 13: కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి పక్కా పథకం వేసి చంపించింది ఓ భార్య. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో ఖతం చేయించింది. ప్రియుడు స్నేహితులు కూడా ఈ క్రైమ్‌లో పాలుపంచుకున్నారు. దారి కాచి గొడ్డలితో నరికి పాశవికంగా చంపేశారు. విచారణ అనంతరం ముద్దాయిలను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేసిన భార్య జయశ్రీ,ప్రియిడు రవీంద్రతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల మండలం పెద్దకొట్టల గ్రామానికి చెందిన నర్సోజికి పది సంవత్సరాల క్రితం జయశ్రీ అనేమహిళతో వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. మృతుడు నర్సోజి స్థానిక అయ్యలూరు గ్రామంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన రవీంద్ర అనే యువకుడితో నర్సజి భార్య జయశ్రీ గత ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త నర్సోజి భార్యను నిలదీసాడు. వ్యవహాసరం పెద్దల దృష్టికి వెళ్ళడంతో పంచాయితీ కూడా జరిగింది. అయినా జయశ్రీ, రవీంద్రల ప్రవర్తనలో మార్పు రాలేదు. హత్యకు రెండు రోజుల క్రితం కూడా మృతుడు నర్సోజి, భార్య జయశ్రీ మద్య పెద్ద గొడవ జరిగింది. ఇదే విషయాన్ని జయశ్రీ ప్రియుడు రవీంద్ర దృష్టికి తీసుకెళ్ళి భర్తను చంపాలని కోరింది. జయశ్రీ కోరిక మేరకు రవీంద్ర తన స్నేహితులు, తెలిసిన వాళ్లు అయిన శిరివెళ్ళ మండలం మహాదేవపురం చెందిన రాజేష్, మహానంది మండలం చెందిన వెంకటరమణ, చిన్న నరసింహుడు, వెంకటేశ్వర్లు, పెద్దకొట్టలకు చెందిన నాగేంద్రలతో కలసి పక్కా స్కెచ్ వేశారు.
పథకంలో భాగంగా ఈనెల 4వ తేదీన మృతుడు నర్సోజి స్కూల్ నుంచి బైక్‌పై వస్తుండగా రవీంద్ర ,రాజేష్‌తో పాటు మరో నలుగురు దారికాచి బైక్‌తో ఢీకొట్టి వేటకొడవలితో నరికి చంపారు. మృతుడు తల్లి రామ్‌బాయి ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యగా అసలు విషయం బయట పడింది. నిందితులు జయశ్రీ, రవీంద్ర, రాజేష్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి వేటకొడవలి, రెండు బైక్ లు స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారించుకోవాలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..