CM Jagan: వీరి వీరి గుమ్మడి పండు.. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?

ఏపీలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ డెడ్‌లైన్ ఆసక్తికరంగా మారింది.  18మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని స్పష్టమైంది. గ్రాఫ్ పెంచుకునేందుకు వారికి అక్టోబర్‌ వరకు టైమ్ ఇచ్చారు జగన్. ఆ..18మంది ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

CM Jagan: వీరి వీరి గుమ్మడి పండు.. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?
Cm Ys Jagan

Updated on: Jun 22, 2023 | 9:11 AM

వీరి వీరి గుమ్మడి పండు.. ఆ 18 మంది ఎమ్మెల్యేల పేర్లేమి? ఏపీ అంతటా ఇప్పుడిదే చర్చ. సొంత పార్టీలో 18మంది శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్ స్వీట్ వార్నింగ్‌తో పాటు డెడ్ లైన్ విధించారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇందుకోసం అక్టోబర్ వరకు సమయం ఇచ్చారు. అప్పటికీ మార్పు లేకుటే సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేల్లో టికెట్‌ భయం పట్టుకుంది. 18మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు.. ఇది సర్వే రిపోర్ట్ సారాంశం. ఆ 18మందితో.. విడివిడిగా త్వరలో వన్‌ టు వన్‌ భేటీ ఉంటుందని స్పష్టం చేశారు సీఎం జగన్‌. దీంతో తాడేపల్లికి ఎవరెవరికి ఎప్పుడు పిలుపు వస్తుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. సర్వేల్లో వాళ్లపై ఉన్న నెగెటివ్ పాయింట్స్‌పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వే రిపోర్ట్‌లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యక్తమైన అభిప్రాయాలను చూస్తే. కొందరు గడప గడపకి వెళ్లడం లేదు.. సచివాలయాల వైపు చూడటం లేదు..  పింఛన్లు, రేషన్‌  కార్డులపై సమీక్ష కూడా చేయడం లేదు.  ఎండల్ని సాకుగా చూపి.. తప్పించుకుంటున్నారు. దీంతో  అక్టోబర్ నాటికి పనితీరు మారాలని.. గ్రాఫ్‌ పెంచుకోకుంటే నో టికెట్‌ అని సీఎం స్పష్టం చేశారు.

అందరూ ఆత్మీయులే. మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. ఎవర్నీ వదులుకోవడం ఇష్టం లేదు. కడవరకూ ఉండాలన్నదే ఆశ. కానీ.. కట్టు దాటినా.. గీత తప్పినా పరిస్థితులు తన చేతిలో ఉండవని కూల్‌గా.. స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం జగన్‌. ఫైనల్‌గా ఆ 18 మంది ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. ఫైనల్‌గా ఆ 18మంది ఎమ్మెల్యేలను టికెట్ టెన్షన్‌ వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..