Watch Video: హెడ్ లైట్‎లో నల్లని ఆకారం.. కట్ చేస్తే బైక్ సర్వీసింగ్‎లో బయటపడ్డ పాము..

తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో ఓ పాము బైక్ లైట్ డూమ్‎లో తలదాచుకుని స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బైక్ రిపేర్ చేస్తుండగా హెడ్ లైట్‎కు చుట్టుకుని మెకానిక్ కంటపడింది. దీంతో బెంబేలెత్తిన మెకానిక్ ఒక్కసారిగా భయంతో బైక్‎ను కింద పడేసి పరుగు తీసాడు. అటుగా వెళ్తున్న స్థానిక యువకులు పామును బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సుమారు 30 నిముషాల పాటు హెడ్ డూమ్‎లో నుండి బయటకు తీసేందుకు కర్రలతో పొడిచారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు.

Watch Video: హెడ్ లైట్‎లో నల్లని ఆకారం.. కట్ చేస్తే బైక్ సర్వీసింగ్‎లో బయటపడ్డ పాము..
Bike Mechanic

Edited By:

Updated on: Jul 04, 2024 | 12:29 PM

తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో ఓ పాము బైక్ లైట్ డూమ్‎లో తలదాచుకుని స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బైక్ రిపేర్ చేస్తుండగా హెడ్ లైట్‎కు చుట్టుకుని మెకానిక్ కంటపడింది. దీంతో బెంబేలెత్తిన మెకానిక్ ఒక్కసారిగా భయంతో బైక్‎ను కింద పడేసి పరుగు తీసాడు. అటుగా వెళ్తున్న స్థానిక యువకులు పామును బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సుమారు 30 నిముషాల పాటు హెడ్ డూమ్‎లో నుండి బయటకు తీసేందుకు కర్రలతో పొడిచారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. డూమ్ లైట్ ఉన్న చోట చుట్టుకుని ఉండిపోవడంతో ఓ యువకుడు ధైర్యం చేసి చేతితో తోకపట్టుకుని బయటకు లాగాడు.

అలాగే బయటకు తీసిన పామును వెంటనే నేలకేసి కొట్టదంతో అక్కడ ఉన్న యువకులు పరుగులు తీశారు. మరికొందరు వీడియోలు తీస్తూ, పామును చూస్తూ ఉండిపోయారు. పామును బయటకు తీసే విధానం చూసేందుకు స్థానికులు గుమిగుడారు. గతంలో ఓ యువకుడు ఇలానే పార్క్ చేసి ఉంచిన బైక్ ట్యాంక్‎లో పామును గమనించుకోలేదు. బైక్ రన్నింగ్ సమయంలో బయటకు రావడంతో భయం‎తో బైక్ పై నుంచి కిందకు దూకి గాయలపాలయ్యాడు. అలాంటి ఘటనే తనకు కూడా రిపీట్ అయి ఉంటే తన పరిస్థితి ఏంటని ఊహించుకుని భయాందోళనకు గురయ్యాడు మెకానిక్. బైక్ రిపేర్ సమయంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకుని హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు ఆ యువకుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..