Vadagandlu: వడగండ్లు ఎలా ఏర్పడుతాయి ? వాటిని తింటే ఏమవుతుంది ?

|

Mar 19, 2023 | 2:40 PM

అసలు వడగళ్ల వాన ఎందుకు పడుతుంది. దానికి వెనుక ఉన్న సైన్స్ ఏంటి..? పదండి తెలుసుకుందాం...

Vadagandlu: వడగండ్లు ఎలా ఏర్పడుతాయి ? వాటిని తింటే ఏమవుతుంది ?
Hailstorms
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి కురిసిన రాళ్ల వానకు చేతికొచ్చిన పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయ్‌. ఇది మాన్‌సూన్‌ సీజన్‌ కాదు, పైగా ఎండాకాలం. మరి ఇప్పుడు వడగళ్ల వాన కురవడానికి కారణమేంటి?. అసలెందుకు వడగళ్ల వర్షం కురుస్తుంది!

వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం క్యుములోనింబస్‌ మేఘాలు, ఇవి వెరీ డేంజరస్‌, వాతావరణంలో అస్థిరత కారణంగా ఇవి ఏర్పడతాయ్‌, భూమి అధికంగా వేడెక్కడం, ఆ వేడిగాలి పైకి లేచే సమయంలో తేమ ఎక్కువగా ఉండటంతో క్యుములోనింబస్‌ మేఘాలుగా మారతాయ్‌. అయితే, ఈ క్యుములోనింబస్‌ మేఘాలు భూమిపైనుంచి అత్యంత ఎత్తుకు చేరతాయ్‌, అంటే మాన్‌సూన్‌ మేఘాలు భూమికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటే, ఇవి మాత్రం 15కిలోమీటర్ల పైవరకూ వెళ్తాయ్‌, అక్కడే మేఘాల్లోని నీటి బిందువులు స్పటికాల్లా రూపాంతరం చెంది పెద్దపెద్ద మంచు బంతుల్లా మారతాయ్‌, అవే వడగళ్లుగా అత్యంత వేగంగా భూమిపైకి దూసుకొస్తాయ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే వేడి-చల్లని గాలుల కలయికే ఈ వడగళ్లు. భూమిని చేరేటప్పుడు వీటి సగటు వేగం గంటకు 106 మైల్స్ వుంటుంది.

తక్కువ టైమ్‌లో ఊహించనిస్థాయిలో బీభత్సం సృష్టించడం క్యుములోనింబస్‌ మేఘాల స్టైల్‌. అంటే, వడగళ్ల విధ్వంసం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. సాధారణంగా వడగళ్లన్నీ సెంటీమీటర్ల లోనే ఉంటాయ్‌. అలాగని అన్ని వడగళ్లూ అదే సైజులో ఉంటాయనుకుంటే పొరపాటే. ఒక్కోసారి అవి నాలుగైదు కిలోలు కూడా ఉంటాయ్‌. 2010లో అర్జెంటీనాలోని ఒక ప్రాంతంలో ఐదు కిలోల బరువున్న వడగళ్ల వర్షం కురిసింది. మన ఇండియాలో కూడా 1888లో మంచు రాళ్ల వర్షం పెను విధ్వంసం సృష్టించింది. మొరదాబాద్‌లో ఆనాడు 246మంది మరణించగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.

మన పూర్వీకులు వడగండ్ల వర్షం కురిసినప్పుడు, ఆ మంచు గడ్డలను తింటే హెల్త్‌కి మంచిదని చెప్పేవారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుందని అనేవారు. అందుకే అప్పట్లో వడగళ్లను తినేవారు. కానీ.. ఇప్పుడున్న వెదర్ అంతా పూర్తిగా పొల్యూట్ అయ్యింది. ఇలాంటి వాతావరణంలో.. స్వతహాగా ఏర్పడిన వడగండ్లను తిన్నా అనారోగ్యమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తినకపోవడమే మేలని సూచిస్తున్నారు.

ముందు చెప్పుకున్నట్టు క్యుములోనింబస్‌ మేఘాలు వెరీవెరీ డేంజరస్‌. ఇవి ఎంత వేగంగా ఏర్పడతాయో, అంతే వేగంగా విధ్వంసం సృష్టిస్తాయ్‌. అసలు క్యుములోనింబస్‌ అంటేనే పెద్ద గాలివాన అని అర్ధం. ఒకవైపు రాళ్ల వర్షం కురిపిస్తూనే …గంటకు 60కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో విరుచుకుపడటం క్యుములోనింబస్‌ స్టైల్‌. ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు భయంగొల్పేలా భారీ శబ్ధాలు కూడా ఈ మేఘాల స్పెషాలిటీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం