AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Weather: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. మరో 24 గంటలు ఏపీలో దంచికొట్టనున్న వర్షం..

ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లపైకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Ap Weather: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. మరో 24 గంటలు ఏపీలో దంచికొట్టనున్న వర్షం..
AP Rains
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2022 | 8:04 AM

Share

Andhra Rains: తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా.. వానలు కంటిన్యూ అవ్వనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ.  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలపడి వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమలో ఉరుములతో కూడిని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది వాతారవరణ శాఖ. ఉత్తరాంధ్రలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న, పత్తి నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాలూరు పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అటు విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలోని తగరపువలస జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. కాలువలు నిండి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వరదనీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సత్యనారాయణ స్వామి కొండచరియలు విరిగి పడుతున్నాయి. రాజాం నియోజకవర్గంలో నాగావళి పరీవాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రేగిడి మండల కేంద్రంలో ప్రభుత్వం కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..