సంక్షేమ పథకాలతోనే టీడీపీ విజయం

టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన‌ సంక్షేమ పథకాలే ఆ పార్టీని గెలిపిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప అన్నారు. కొవ్వూరు, తాళ్లపల్లి మండలాల్లో ఆమె ప్రచారం చేశారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి అనిత కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తాము ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఇంతటి ఆదరణకు చంద్రబాబు చేసిన మంచిపనులే కారణమన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, టీడీపీని తిరిగి ప్రజలు అత్యధిక మెజార్టీతో […]

సంక్షేమ పథకాలతోనే టీడీపీ విజయం

Edited By:

Updated on: Apr 05, 2019 | 7:13 PM

టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన‌ సంక్షేమ పథకాలే ఆ పార్టీని గెలిపిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప అన్నారు. కొవ్వూరు, తాళ్లపల్లి మండలాల్లో ఆమె ప్రచారం చేశారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి అనిత కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తాము ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఇంతటి ఆదరణకు చంద్రబాబు చేసిన మంచిపనులే కారణమన్నారు.

టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, టీడీపీని తిరిగి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని రూప ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలూ టీడీపీకి చెందినవారే. ఇక వైసీపీ నుంచి బీసీ అభ్యర్థి ఎం.భరత్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తున్నారు