Andhra Pradesh: ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ఫ్యామిలీ మేటర్స్‌

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో ప్రచారహోరు పెరిగింది. ఓట్ల వేటలో ఉన్న నేతలు.. ప్రత్యర్థులపై విమర్శలకు పదును పెంచుతున్నారు. పవన్‌ టార్గెట్‌గా సీఎం జగన్‌ చేసిన విమర్శలతో.. భార్యల పంచాయితీ మరోసారి పొలిటికల్‌ తెరమీదకొచ్చింది. ఏపీ పాలిటిక్స్‌లో ఫ్యామిలీ మేటర్స్‌పై రచ్చ.. కామనే అయినా... ఎన్నికల వేళ ప్రచారస్త్రంగా మారడం చర్చనీయాంశంగా మారింది.

Follow us

|

Updated on: Apr 20, 2024 | 6:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు నామినేషన్ల పర్వం.. మరోవైపు ప్రచారపర్వం.. సమాంతరంగా కొనసాగుతున్నాయి. సిద్దం సభలతో అధికారపక్షం హోరెత్తిస్తుంటే.. ప్రజాగళం సభలతో విపక్షం అదేస్థాయిలో విరుచుకుపడుతోంది.అయితే, తాజాగా నేతల మధ్య పర్సనల్‌ ఎటాక్స్‌ మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో నేతల వ్యక్తిగత అంశాలే.. ప్రత్యర్థులకు వెపన్స్‌గా మారుతున్నాయి. గోదావరి జిల్లాలే తన అడ్డాగా భావిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను… అదేగడ్డపై తీవ్రస్థాయి విమర్శలతో సీఎం జగన్‌ టార్గెట్‌ చేయడం పొలిటికల్‌గా హీట్‌ పెంచింది.

మ్యారేజీ స్టార్‌ అంటూ.. మరోసారి పవన్‌పై పర్సనల్‌ ఎటాక్‌ చేశారు జగన్‌. ఆయనకు పెళ్లిళ్లే కాదు, నియోజకవర్గాలూ నాలుగయ్యాయంటూ ఎద్దేవా చేశారు. పవన్‌కు ఏ ఒక్క నియోజకవర్గంపైనా ప్రేమ ఉండదంటూ విమర్శలు గుప్పించారు జగన్‌.

పెళ్లిళ్లు, భార్యల ముచ్చట ఏపీ రాజకీయాల్లో కొత్త కాకపోయినా… సరిగ్గా ఎన్నికల వేళ మరోసారి ఈ వ్యక్తిగతమైన అంశాలు తెరమీదకు రావడం చర్చనీయంగా మారింది. గతంలోనూ జగన్‌, పవన్‌ మధ్య.. ఈ విషయంలో మాటల యుద్దం నడిచింది. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో కచ్చితంగా ప్రస్తావనకు వస్తుందని రనీ.. గతంలోనే పవన్‌ స్పష్టం చేసినట్టు జనసేనవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఓట్ల కోసం జగన్‌ అదే పనిచేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

మొత్తానికి మరోసారి ఏపీ పాలిటిక్స్‌.. నేతల వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్యామిలీ మేటర్స్‌తో పతాకస్థాయికి చేరుకున్న పొలిటికల్‌ ఫైట్‌.. పోలింగ్‌ నాటికి ఇంకేస్థాయికి చేరుతాయో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..