AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు

నైరుతీ ఎఫెక్ట్ మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వానలతో జనం పొలం బాట పడుతున్నారు. అటు పాడేరులోనూ వాతావరణం మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు
Rains

Updated on: Jun 28, 2025 | 7:05 PM

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
—————————————————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————————

ఈరోజు,రేపు, ఎల్లుండి:-
————————————-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-
————————————-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 3 0 – 40 కి.మీ. వేగం వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-
——————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-
—————————————–

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

తెలంగాణ వర్షాలు ఇలా..

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. భోరజ్ మండలంలోని తర్నం వాగుకు వరద పోటెత్తుతోంది. తాత్కాలిక వంతెన పూర్తిగా జలమయం కావడంతో జైనాథ్, బేల, మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నీరాల, సాంగి మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సిరికొండ మండలంలో చిక్‌మాన్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్‌లో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌కు పెద్దఎత్తున వరద నీరు చేరింది. భైంసా పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ముసురు పట్టి వాన కురవడంతో పంటలకు జీవం పోసినట్లయింది.

వర్షం కారణంగా పత్తి, సోయా పంటలకు మొలకలు వస్తాయని ఆశిస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ప్రాంతంలో ఏకదాటిగా పడుతున్న వర్షంతో 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వర్షం కారణంగా లక్షా 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా జూరాల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల మేర వరద వచ్చిచేరింది. 12 గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జూరాల ప్రాజెక్టులో గేట్లు ప్రమాదకరంగా మారాయి. 9వ నెంబర్‌ గేటు రోప్‌ పూర్తిగా తెగిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..