AP Weather: బంగాళాఖాతం మరో అల్పపీడం ఏర్పడే ఛాన్స్.. ఏపీకి వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

AP Weather: బంగాళాఖాతం మరో అల్పపీడం ఏర్పడే ఛాన్స్.. ఏపీకి వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Andhra Pradesh Weather Update

Updated on: Nov 06, 2022 | 1:12 PM

శ్రీలంక తీరం వెంబడి ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9వ తేదీన  అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇది వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది తదుపరి 48 గంటలలో స్వల్పముగా బలపడే అవకాశం ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు,  ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెదరుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :——-

ఈరోజు, రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :—–

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి