AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు ప్రాంతాలకు 3 రోజులు వర్షసూచన

|

Jan 29, 2023 | 2:31 PM

ఆదివారం ఉత్తర కోస్తా ప్రాంతాలు, పుదుచ్చేరిలో ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాడు కోస్తా ప్రాంతాలు, పరిసర జిల్లాల్లో వర్షాలు చెదురుమదురు జల్లులు పడతాయని వివరించారు.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు ప్రాంతాలకు 3 రోజులు వర్షసూచన
Andhra Pradesh Weather Report
Follow us on

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తూర్పు /ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం అనగా తూర్పు భూమధ్యరేఖ ప్రాంతము మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంటుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, నైరుతి బంగాళాఖాతం మీదుగా జనవరి 30 నాటికి అల్పపీడనంగా మరింత బలపడి ఫిబ్రవరి 01 నాటికి శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఆది, సోమ, మంగళవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఆదివారం:- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

సోమ, మంగళవారాలు :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఆదివారం::- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 4 °C వరకు తక్కువగా, ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.

సోమవారం:- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 °C వరకు తక్కువగా, ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.

మంగళవారం:- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం