AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో

ఏపీకి మరో రెయిన్ అలెర్ట్ వచ్చింది. వానలు దంచి కొట్టే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో
Andhra Weather alert
Follow us

|

Updated on: Dec 05, 2022 | 10:14 AM

ఏపీలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా దక్షిణ అండమాన్ ప్రాంతంలో కొనసాగుతున్న ద్రోణి మరో రెండురోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఉత్తర తమిళనాడు, ఏపీ, దక్షిణకోస్తావైపు పయనిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 08 ఉదయం నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడులోని పుదుచ్చేరిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. అల్ప పీడనం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపోస్పియర్‌లో ఈశాన్య, తూర్పుగాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ సూచన ప్రకారం, ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది,  దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేడు, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ తెలిపారు. మరోవైపు ఈ మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

డిసెంబరు 8న లక్షద్వీప్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, మహారాష్ట్రలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 8 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని IMD మత్స్యకారులను కోరింది. కాగా, పుదుచ్చేరిలో ఆదివారం కురిసిన వర్షాలకు నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..