AP Weather: ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

|

Nov 27, 2022 | 6:58 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Weather: ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
Andhra Weather Report
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆల్రెడీ బలహీనపడింది. ప్రజంట్ తమళనాడు వైపుగా పయనిస్తుంది. దీంతో ఇటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయీలలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈ రోజు, రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

 

పెరిగిన చలి తీవ్రత

మరోవైపు అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ చలితీవ్రత క్రమంగా పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మార్నింగ్ 9 వరకు మంచు  తెరలు వీడటం లేదు. దీంతో పొద్దున్నే పనుల నిమిత్తం బయటకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

అరకులో అద్భుత దృశ్యాలు

ప్రశాంత వాతావరణంలో సూర్యోదయాన్ని వీక్షించడం ఎప్పుడూ అద్భుతమైన అనుభవమే. మంచు తెరల్ని చీల్చుకుంటూ లేలేత కిరణాలు నేలను తాకుకుంటే ఆ ఉదయపు దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవ్‌. ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్‌ని పదింతలు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తున్నారు అరకు వెళ్లిన టూరిస్ట్‌లు. అక్కడ వంజగి మేఘాల కొండ దగ్గర దూదిపింజల్లా తేలుతున్న మేఘాలు.. వాటిని పైనుంచి చూస్తూ సూర్యోదయాన్ని వీక్షించిన టూరిస్ట్‌లు ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఇవాళ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. వీకెండ్ కావడంతో రద్దీ బాగా కనిపిస్తోంది. మాడగడ, వంజంగి మేఘల వ్యూ పాయింట్‌కి వేలాది మంది టూరిస్ట్‌లు పోటెత్తారు. ఈ ప్రభావంతో ట్రాఫిక్‌ కూడా విపరీతంగా పెరిగింది. అరకులో హోటల్స్‌, లాడ్జ్‌లు అన్నీ ఫుల్ అయిపోయాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..