Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలెర్ట్.. రానున్న రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు..

|

Jan 07, 2023 | 8:50 AM

ఓ వైపు చలి, మరోవైపు వర్షాలు.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలెర్ట్.. రానున్న రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు..
Rain Alert
Follow us on

ఓ వైపు చలి, మరోవైపు వర్షాలు.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ప్రాంతంపైన విండ్ కన్వర్జన్స్ (గాలుల సంగమం) కారణంగా ఆంధ్రాలో, అదేవిధంగా తెలంగాణలో పలు చోట్ల స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా, ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ నగరంలో అత్యథికంగా 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. చాలా చోట్ల వాతావరణం పొడిగానే ఉంది. దీంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. తెలంగాణలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి.

కాగా.. హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో నాలుగు రోజులపాటు.. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న వర్షం పడటంతో.. డ్రైలైన్ షవర్స్ కారణంగా చలి తీవ్రత మరింత పెరగుతుందని పేర్కొంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..