AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు ఎలా ఉందనుందంటే.? వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Dec 28, 2022 | 5:00 PM

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..

AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు ఎలా ఉందనుందంటే.? వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Andhra Pradesh Weather
Follow us on

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మాల్దీవులు, దానిని ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంలో ఉన్న అల్పపీడనం బలహీనపడిందని పేర్కొంది. అయితే అదే ప్రాంతంపై సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుందన్నారు.

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:-

  • ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం అవకాశం ఉంది.

  • దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

  • రాయలసీమ:-

ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు పెరిగాయి. ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.