Andhra Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి

దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో ఇప్పుడు ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల మీదగల ఉపరితల ఆవర్తనము నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

Andhra Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి
Andhra Weather Report

Updated on: May 06, 2025 | 3:30 PM

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

మంగళవారం, బుధవారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రాయలసీమ :-

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

గమనిక :- రానున్న 4 రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, యానంలలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు. తరువాత స్వల్పంగా పెరిగే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..