High Speed Rail Corridors: కేవలం మూడు గంటల్లోనే చెన్నై, బెంగళూరు.. అమరావతికి జస్ట్ 75 నిమిషాల్లోనే.. హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రత్యేకతలివే..

హైస్పీడ్ రైల్ కాారిడార్లను తెలుగు రాష్ట్రాల మీదుగా కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అందుబాటులోకి వస్తే కేవలం గంటల వ్యవధిలోనే చెన్నై, బెంగళూరు, పుణెకు చేరుకోవచ్చు. ఇక 75 నిమిషాల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఇంకా ఎన్నో వివేషాలు ఉన్నాయి.

High Speed Rail Corridors: కేవలం మూడు గంటల్లోనే చెన్నై, బెంగళూరు.. అమరావతికి జస్ట్ 75 నిమిషాల్లోనే.. హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రత్యేకతలివే..
High Speed Trains

Updated on: Feb 02, 2026 | 7:23 AM

కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణెకు హైస్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించనున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లు తిరగనున్నాయి. దీని వల్ల వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే సౌలభ్యంతో పాటు కంపెనీలు కొత్తగా వస్తాయి. లాజిస్ట్రిక్స్, హోటల్ బిజినెస్ కూడా పెరుగుతోంది. ఈ కారణాలతో వేలాది మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా.. అందులో హైదరాబాద్‌ నుంచి ఏకంగా మూడు ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో రైల్వే నెట్‌వర్క్‌లో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని అర్థమవుతోంది.

రాకపోకలు వేగవంతం

హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే హైస్పీడ్ రైలు కారిడార్ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింతగా వేగవంతం కానుండగా.. చెన్నై, బెంగళూరుకు మరింత వేగంగా ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఆ రైళ్లు వేగవంతంగా నడిపేందుకు ఈ కారిడార్లు ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు ప్రతిపాదనకు ఇప్పటికే డీపీఆర్ రెడీ అయింది. కలబురిగి, శోలాపూర్, జహీరాబాద్, పంధార్‌పుర్, అక్లుజ్, పుణె, లోనవాలవా, దౌడ్ వంటి స్టేషన్లు మధ్యలో ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక హైదరాబాద్-చెన్నై రైలు కారిడార్‌కు సంబంధించి శంషాబాద్, సూర్యపేట, ఖమ్మం నుంచి అమరావతి వైపు రూట్ ఉంటుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ రూట్ శంషాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి నుంచి శ్రీశైలం మార్గంలో వెళ్లనుంది.

స్పీడ్ ఎంతంటే..?

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ 576 కిలోమీటర్లు ఉండనుండగా.. ఇందుకోసం రూ.1.44 లక్షల కోట్లు అవసరమవ్వనుంది. హైదరాబాద్-చెన్నై కారిడార్ 744 కి.మీగా ఉంటుంది. ఇందుకోసం రూ.1.86 లక్షల కోట్లు ఖర్చవుతుందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ కారిడార్లు ముగిసిన తర్వాత అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రవేశపెడతారు. ఇవి గంటకు 350 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు పూర్తయితే కేవలం 3 నుంచి 4 గంటల్లోనే చెన్నై,బెంగళూరు, పుణెకు చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం, వరంగల్‌కు గంట, అమరావతికి 75 నిమిషాలు, అనంతపురానికి 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ఈ హైస్పీడ్ రైళ్లల్లో కేవలం ఏసీ కోచ్‌లే ఉంటాయి. అయితే ప్రయాణఛార్జీ భారీగానే ఉండే అవకాశముందని చెబతున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, అనంతపురం, తిరుపతి మార్గాల్లోని అన్ని పట్టణాలకు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు.