Andhra Pradesh: అరేయ్ ఏంట్రా ఇది.. బైక్‌పై లవర్స్ బరితెగింపు.. పబ్లిక్‌గా పాడు పని.. కట్ చేస్తే..
పైన పేర్కొన్న వీడియో చూసి ఏ విన్యాసమో జరుగుతోందనుకుంటే పొరపాటే.. పైగా అది ఏ సినిమా షూటింగ్ కూడా కాదు..

పైన పేర్కొన్న వీడియో చూసి ఏ విన్యాసమో జరుగుతోందనుకుంటే పొరపాటే.. పైగా అది ఏ సినిమా షూటింగ్ కూడా కాదు. ఓ యువకుడు తన లవర్‌ను బైక్ ట్యాంక్‌పై అసభ్యకర రీతిలో కూర్చుబెట్టుకుని పట్టపగలే రయ్.. రయ్‌మంటూ దూసుకుపోతున్నాడు. పబ్లిక్‌గా వీరు చేస్తోన్న ఈ పాడుపని అటుగా ఓ కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. ఇక ఈ ఘటన విశాఖపట్నంలోని ప్రధాని రహదారిపై చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతే! అది నెట్టింట చక్కర్లు కొట్టిన రెండు గంటలలోపే సదరు ద్విచక్ర వాహనం నడిపిన యువకుడు, యువతిని స్టీల్‌ప్లాంట్ పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఇరువురిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిద్దరూ గాజువాక సమీప వెంపలినగర్, సమతానగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ హెచ్చరించారు.
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/i2dGgHKElg
— Vizag News Man (@VizagNewsman) December 29, 2022
