Watch Video: ఆ నోట్లకు వస్తువులు అమ్మబడవు.. ఓ షాపులో వింత ప్రచారానికి తెర..

|

May 15, 2024 | 11:09 AM

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన హక్కు. అయితే కొందరు ఈ ఓటును వేలంపాటలో వస్తువులను అమ్మినట్లు ప్రజా ప్రతినిధులకు అమ్ముకుంటున్నారు. సరైన రేటు ఇస్తేనే ఓటు వేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే తమకు ఓటు ఇవ్వలేదని ఓటు వేయమంటూ బహిష్కరించిన ఉదంతాలు చూశాము.

Watch Video: ఆ నోట్లకు వస్తువులు అమ్మబడవు.. ఓ షాపులో వింత ప్రచారానికి తెర..
Notes
Follow us on

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన హక్కు. అయితే కొందరు ఈ ఓటును వేలంపాటలో వస్తువులను అమ్మినట్లు ప్రజా ప్రతినిధులకు అమ్ముకుంటున్నారు. సరైన రేటు ఇస్తేనే ఓటు వేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే తమకు ఓటు ఇవ్వలేదని ఓటు వేయమంటూ బహిష్కరించిన ఉదంతాలు చూశాము. ఇలాంటి ఓటరు కోసం ఓ వ్యాపారి వింత ప్రచారానికి తెరలేపారు. ఓటరు మహాశయులారా.. నోటుకు ఓటును అమ్ముకున్న డబ్బులతో తమ షాపుకు వస్తువులు కొనేందుకు రావొద్దంటూ బోర్డు పెట్టాడు. దీంతో అటుగా వెళ్లిన జనం షాక్ అవుతున్నారు.

గుడివాడలో ఓ రేడియో షాపు యాజమాని ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. నగరంలో కొందరిని ఈ సందేశం అకర్షించింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మరింది. దీనిపై నెటిజెన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్య స్పూర్తికి ఆదర్శంగా నిలుస్తారని చెబుతుంటే.. మరి కొందరు మాత్రం ఏవి రాజకీయనాయకులు పంచిన నోట్లు, ఏవి నిజాయితీగా సంపాదించిన నోట్లు కనుక్కోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వార్త తెగ ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..