AP Flood: కోనసీమలో ప్రమాద ఘంటికలు.. జలదిబ్బంధంలో గ్రామాలు

|

Jul 15, 2022 | 9:17 AM

AP Flood: ధవళేశ్వరం వద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది గోదావరి. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు లంక గ్రామాలు నీటిలో నానుతున్నాయి..

AP Flood: కోనసీమలో ప్రమాద ఘంటికలు.. జలదిబ్బంధంలో గ్రామాలు
Ap Flood
Follow us on

AP Flood: ధవళేశ్వరం వద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది గోదావరి. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు లంక గ్రామాలు నీటిలో నానుతున్నాయి. దీంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన అధికారులు కోనసీమ జిల్లాలో 38 లంక గ్రామాల ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. ముమ్మిడివరం, అయినవిల్లి, పి.గన్నవరం, రాజోలు, తాళ్లరేవు, కె.గంగవరం మండలాల్లో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

లంక గ్రామాలను ఇప్పటికే గోదావరి వరద చుట్టుముట్టింది. ఇళ్లు నాలుగు రోజులుగా నీటిలో నానుతున్నాయి. పూరిళ్లలో నివాసం ఉంటున్న వారిని అలర్ట్ చేశారు అధికారులు. అత్యవసరంగా సహాయ శిబిరాలకు షిఫ్ట్ చేశారు. అర్ధరాత్రి మూటాముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు వరద బాధితులు. గర్భిణీలు, వృద్ధులకు మురమళ్ల హైస్కూల్‌లో పునరావాసం కల్పించారు. కోయిదా, కట్కూరులో హెలికాప్టర్ల ద్వారా నిత్యవసర వస్తువులు, ఆహార పొట్లాలు అందిస్తున్నారు. గోదావరి వరదతో కుకునూరు అశ్వరావుపేట రహదారి నీట మునిగింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఫ్‌ బృందాలు సహాయక నిమగ్నమయ్యాయి. వరద ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

విలీన మండలాల్లో సుమారు 18వేల మంది వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రాత్రి నుండి కూడా తరలింపు చర్యలు చేపట్టిన అధికారులు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో భారీగా చేరిన గోదావరి వరద నీరు చేరడంతో 40 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కోనసీమలోని లంక గ్రామాలన్ని వరదనీరు చుట్టుముట్టేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి