Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లాలో ఈతెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు చిలమత్తూరు, కోడూరు వద్ద జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి వేగంగా వస్తున్న వోల్వో బస్సు ఢీకొట్టింది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో గాయడపిన వారిని చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా ప్రయాణీకులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..