ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల(Volunteer) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించేలా వారికి బాధ్యతలు అప్పగించారు. వీరి సహాయంతో రాష్ట్రంలో 95 శాతానికి పైగా పెన్షన్లను(Pensions) పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాకుండా గ్రామస్థాయిలో జరిగే పనులనూ వాలంటీర్లే చేస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుంటున్న కొందరు వాలంటీర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జనాలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను జేబులో వేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) లో ఓ వాలంటీర్ పెన్షన్ డబ్బు తీసుకొని, ప్రియురాలితో కలిసి ఉడాయించాడు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రతినెల 1వ తేదీనే రావాల్సిన పెన్షన్ ఇంకా రాకపోవడంతో ఆ వార్డులోని వాలంటీర్లంతా సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సచివాలయ సిబ్బంది ఆరా తీయగా సదరు వాలంటీర్ ఆ డబ్బులను తీసుకొని ప్రియురాలితో వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయనే ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీంతో సిబ్బంది ఆ డబ్బును పెన్షన్ల కింద పంపిణీ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ప్రియురాలితో కలిసి పారిపోయిన వాలంటీర్ కు అప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై యువతి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read