Andhra: అయ్యో దేవుడా.. మనవడు చనిపోయాడన్న విషయం తెలిసి ప్రాణాలు విడిచిన నాయనమ్మ..

మనవడు మరణించాడన్న మరణవార్త విని నాయనమ్మ ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని లచ్చందొరపాలెంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కలసిమెలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్న నాయనమ్మ, మనవడి మృతి.. ఒక్కసారిగా గ్రామంలో తీవ్ర విషాదానికి దారి తీసింది.

Andhra: అయ్యో దేవుడా.. మనవడు చనిపోయాడన్న విషయం తెలిసి ప్రాణాలు విడిచిన నాయనమ్మ..
Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 03, 2025 | 8:43 PM

మనవడు మరణించాడన్న మరణవార్త విని నాయనమ్మ ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని లచ్చందొరపాలెంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కలసిమెలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్న నాయనమ్మ, మనవడి మృతి.. ఒక్కసారిగా గ్రామంలో తీవ్ర విషాదానికి దారి తీసింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిపిస్తున్నారు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నాలమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అనారోగ్యంతో మృతి చెందారు. మరో కుమార్తె, పెద్ద కొడుకు కుమారుడు గొగ్గి గంగరాజు కన్నాలమ్మ వద్దే ఉంటున్నారు. మనమడు గంగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. గంగరాజు వివాహం అయిన తరువాత భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తెతో కలిసి హాయిగా జీవనం సాగిస్తున్నాడు.. కన్నాలమ్మకు మనమడు గంగరాజు అంటే వల్లమాలిన అభిమానం. మనమడులో మరణించిన కొడుకును చూసుకొని సంతోషంగా ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా గంగరాజు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గంగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేక ఆసుపత్రిలోనే మృతిచెందాడు గంగరాజు. కన్నాలమ్మకు గుండె సమస్యతో పాటు వయస్సు పైబడటంతో అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.

ఇదే సమయంలో మనవడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ విషయంతోనే ఆమె తీవ్ర మనోవేదనకు గురై నిత్యం బాధపడుతూ ఉంది. అలాంటి సమయంలో మనమడు మరణవార్త విని కన్నాలమ్మ తట్టుకోలేదని కుటుంబ సభ్యులు ఆమెకు విషయం తెలియకుండా దాచిపెట్టారు. అయితే కుటుంబసభ్యులు దాచినప్పటికీ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుకోకుండా కన్నాలమ్మ కు కనిపించి నీ మనవడు చనిపోయాడని చెప్పడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

కొద్ది నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుతో కన్నాలమ్మ మృతిచెందింది. అటు మనవడు మరణం .. ఇటు నాయనమ్మ అకస్మాత్తుగా మృతి.. ఒకేసారి కుటుంబాన్ని కుదిపేశాయి. గ్రామమంతా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. కన్నాలమ్మ, మనవడు గంగరాజుల అంత్యక్రియలను ఒకే రోజు నిర్వహించడంతో ఊరు ఊరంతా కన్నీటి పర్యంతమైంది. ఈ దుర్ఘటన స్థానికుల హృదయాలను తాకింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..