Vizag: ఆమె మళ్లీ అరెస్టయింది.. అవును మీరు చదివింది కరెక్టే..

అందంతో వల వేసి, మత్తుమందు పెట్టి, ఏకాంత ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేయడం... ఇదే జాయ్ జమీమా స్టైల్. వైజాగ్ కేంద్రంగా హనీట్రాప్ గ్యాంగ్ నడిపిస్తూ పలువురిని మోసం చేసిన ఆమె, తాజాగా మరోసారి అరెస్ట్ అయ్యింది. విశాఖలో నాలుగు కేసులు ఎదుర్కొంటున్న జమీమాను.. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Vizag: ఆమె మళ్లీ అరెస్టయింది.. అవును మీరు చదివింది కరెక్టే..
Joy Jameema

Updated on: Aug 14, 2025 | 5:49 PM

ఆమె మళ్లీ అరెస్టయింది, ఔను ఆమె మళ్లీ అరెస్టయింది. హలో అంటూ ఓ హస్కీ వాయిస్‌తో డబ్బున్న వాళ్లనే టార్గెట్ చేసి, స్పైసీగా వీడియో కాల్స్‌తో పరిచయం పెంచుకుని బ్లాక్‌మెయిల్ చేసే రొటీన్ హనీట్రాప్ కథల్లో ఇదో వెరైటీ కథ. జాయ్ జమీమా కేరాఫ్ వైజాగ్. అందంతో వల వేసి లోకల్ నుంచి ఎన్‌ఐఆర్‌ల వరకు ఉచ్చులో దింపి వసూళ్లకు పాల్పడే జమీమా మళ్లీ అరెస్ట్ అయింది. ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లో ఉంది.

పలుకుబడి ఉన్న వాళ్లు, ఉన్నత వర్గాలు, బిజినెస్‌మెన్లను ట్రాప్ చేసి, మత్తు మందు ప్రయోగించి, ఏకాంత ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డటం జమీమ్ స్టయిల్ ఆఫ్ చీటింగ్. అలా పెద్ద మొత్తంలో వెనకేసినట్టు జమీమాపై అభియోగాలు ఉన్నాయి. విశాఖలోని నాలుగు వేర్వేరు పీఎస్‌లలో జమీమాపై కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యే బెయిల్‌పై విడుదలైన జమీమాను, మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు.

గతంలో వెస్ట్ బెంగాల్‌కి చెందిన వ్యక్తిని మోసగించిన కేసులో చాలామంది జమీమాకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ కోసం జమీమా ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను మెయిన్‌టెయిన్ చేస్తోంది. ఇప్పుడా ముఠా మూలాలన్నింటిని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.

జమీమా బాధితులు విశాఖతోపాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె వల్ల జీవితాలు నాశనం అయ్యాయని.. కొందరు ఆత్మహత్యయత్నాలు కూడా చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందంటున్నారు పోలీసులు. సమాజంలో మర్యాద పోతుందని ఇంకా చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారని.. వారు బయటకు వస్తే వివరాలు గోప్యంగా ఉంచి.. ఆమెపై కేసు నమోదు చేస్తామని.. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి