నేడు వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించనున్న సీఎం జగన్

| Edited By:

Sep 11, 2020 | 8:59 AM

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలుకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నేడు వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించనున్న సీఎం జగన్
Follow us on

YSR Asara Scheme: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలుకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మహిళలకు లబ్ది చేకూర్చే వైఎస్సార్ ఆసరా పథకంను జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ పథకం వలన 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 87 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. ఈ క్రమంలో మొదటి విడత నగదును మహిళలకు వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా పొదుపు సంఘాల మహిళలకు నాలుగేళ్లలో 27, 128 కోట్లు అందించనున్నారు. తొలి విడతలో భాగంగా 6,792 కోట్లు విడుదల చేస్తున్నారు. సీఎం జగన్‌ ఒక్క బటన్ నొక్కడం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ అవ్వనుంది. ఈ పథకం ద్వారా పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందని జగన్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,426 కొత్త కేసులు.. 13 మరణాలు

శ్రావణి కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్