Watch Video: సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. మత్స్యకారుల వలలో భారీ సొర..

| Edited By: Srikar T

Apr 13, 2024 | 8:57 AM

విశాఖ తీరం నిరంతరం అనేక వింతలు, విశేషాలకు వేదిక అవుతూనే ఉంది. రకరకాల సముద్ర జీవులు వివిధ రకాల కారణాలతో ఒడ్డుకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. సముద్ర విజ్ఞానంపై ఆసక్తి ని మరింత పెంచుతూనే ఉంటాయి. వింతైన చేపల నుంచి ఇటీవల తీరం వెంబడి జెల్లీ ఫిష్‎ల ఉనికి వరకూ, తాజాగా సముద్రపు తాబేళ్లు నుంచి తిమింగలాలు వరకూ నిరంతరం విశాఖ తీరంలో ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తూనే ఉన్నాయి.

Watch Video: సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. మత్స్యకారుల వలలో భారీ సొర..
Shark
Follow us on

విశాఖ తీరం నిరంతరం అనేక వింతలు, విశేషాలకు వేదిక అవుతూనే ఉంది. రకరకాల సముద్ర జీవులు వివిధ రకాల కారణాలతో ఒడ్డుకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. సముద్ర విజ్ఞానంపై ఆసక్తి ని మరింత పెంచుతూనే ఉంటాయి. వింతైన చేపల నుంచి ఇటీవల తీరం వెంబడి జెల్లీ ఫిష్‎ల ఉనికి వరకూ, తాజాగా సముద్రపు తాబేళ్లు నుంచి తిమింగలాలు వరకూ నిరంతరం విశాఖ తీరంలో ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తూనే ఉన్నాయి.

మత్స్యకారుల వలకు భారీ తిమింగలం..

తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెంలో మత్స్యకారులను ఒక తిమింగలం షాక్‎కు గురిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది. సమీప పరవాడ మండలం వాడచీపురపల్లికి చెందిన మత్స్యకారులు తీరంలో చేపల వేట చేస్తున్న నేపథ్యంలో వల లాగుతుండగా చాలా బరువు అనిపించింది. దాంతో వాళ్ళలో తెలియని ఆనందం, ఆందోళన రెండూ ఒకేసారి కలిగాయి. పెద్దఎత్తున చేపలు పడ్డాయనుకొన్న ఆనందంతో వలను అతి కష్టం మీద తీరానికి లాక్కొని వచ్చారు. తీరా చూస్తే అందులో ఒక భారీ తిమింగలం కనిపించింది. 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉండటంతో తొలుత మత్స్యకారులు ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని ధైర్యం చేసి దాన్ని పరిశీలించగా, అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. తిరిగి సముద్రంలోకి పంపేందుకు ఎంత ప్రయత్నం చేసినా అది వెళ్ళలేక పోయింది దీంతో అక్కడే వదిలేశారు. తిమింగలం అక్కడే చనిపోతే రోజుల తరబడి వచ్చే దుర్వాసన భరించలేమని, వేటకు కూడా వెళ్ళలేమని వెంటనే తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.

ఫార్మా కాలుష్యం వల్లనేనా?

ఇటీవల పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో పలు సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు చేరుతున్నాయి. ఇటీవల భారీ సైజ్‎లో ఉండే సముద్రపు తాబేళ్లు, కొన్ని సందర్భాలలో చేపలు చనిపోయి తీరం వెంబడి కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ సమీపంలోని సెజ్ తో పాటు ఫార్మా కు చెందిన కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేస్తుండటమే కారణంగా పలువురు మత్స్యకారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలుష్యం వల్లనే గతంలోనూ చిన్నచిన్న తిమింగలాలు కూడా చనిపోయి తీరానికి చేరాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు పట్ల అధికారులు అప్రమత్తం కాకుంటే తీవ్ర దుష్ఫలితాలను చూడాల్సి వస్తుందన్న అవేదన వారిలో వ్యక్తం అవుతూ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..