Vizag Road Accident: నలుగురి ప్రాణాలు తీసిన తాగుబోతు డ్రైవర్.. ఎట్టకేలకు కటకటాల్లోకి..!

| Edited By: Srilakshmi C

Aug 14, 2023 | 8:55 PM

విశాఖ ఋషికొండ బీచ్ రోడ్ కారు బీభత్సం కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు వినయ్ ఎట్టకేలకు జైలుకెళ్ళాడు . స్నేహితుడు సహాయంతో వినయ్ పోలీసుల చెంతకు చేరాడు. తప్ప తాగి కారు నడిపి బీభత్సం సృష్టించి నలుగురు ప్రాణాలు పోయేందుకు కారకుడు అయ్యాడు వినయ్. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో వినయ్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇతనితో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చున్న మరో యువకుడు రవి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ కారులోనే ప్రయాణిస్తున్న మణికుమార్, రవికిరణ్ ఇద్దరూ ప్రాణాలు..

Vizag Road Accident: నలుగురి ప్రాణాలు తీసిన తాగుబోతు డ్రైవర్.. ఎట్టకేలకు కటకటాల్లోకి..!
Rushikonda Beach Road Accident
Follow us on

విశాఖపట్నం, ఆగస్టు 14: విశాఖ ఋషికొండ బీచ్ రోడ్ లో వారం క్రితం జరిగిన కారు బీభత్సం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తప్ప తాగి వాహనం అతివేగంగా నడిపిన ఘటనలో.. నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారు అదుపుతప్పి డివైడర్ పైకి విద్యుత్ స్తంభాన్ని చెట్టును ఢీకొని అవతల వైపు బైకును ఢీ కొట్టి ఫుట్పాత్ పైకి ఎక్కి ఆగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలుపోగా.. మరో యువకుడు ఆసుపత్రిలో ఊపిరి వదిలాడు. కారు ఢీకొని బైక్ పై వెళ్తున్న మహిళా సహా ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న కారు డ్రైవ్ చేసిన వినయ్ అలియాస్ మహంతి ఎట్టకేలకు కటకటల్లోకి వెళ్ళాడు.

అప్పటినుంచి పారిపోయి..

విశాఖ ఋషికొండ బీచ్ రోడ్ కారు బీభత్సం కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు వినయ్ ఎట్టకేలకు జైలుకెళ్ళాడు . స్నేహితుడు సహాయంతో వినయ్ పోలీసుల చెంతకు చేరాడు. తప్ప తాగి కారు నడిపి బీభత్సం సృష్టించి నలుగురు ప్రాణాలు పోయేందుకు కారకుడు అయ్యాడు వినయ్. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో వినయ్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇతనితో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చున్న మరో యువకుడు రవి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ కారులోనే ప్రయాణిస్తున్న మణికుమార్, రవికిరణ్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు కారు ఢీకొన్న దాటికి బైక్ పై ప్రయాణిస్తున్న ప్రియాంక పృద్వి రాజ్ అనే ఇద్దరు కూడా మృతి చెందారు. ప్రమాదం తరువాత పరారైన వినయ్ అలియాస్ మహంతి.. ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్ళాడు. కార్పెంటర్గా పనిచేస్తూ వేరొకడి వద్ద కారు తీసుకొని మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు వినయ్.

కేసు నమోదు..

ఘటన తీవ్రత నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం నింపింది. తెలిసిన వారిని తీవ్రంగా కలచివేసింది. నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. దీంతో పోలీసులు.. 304 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వినయ్ కోసం గాలించారు. ఎటగలకు ప్రత్యక్షమవడంతో.. అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు పోలీసులు. దీంతో న్యాయస్థానం నిందితుడు హేమంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇవి కూడా చదవండి

మరికొందరి పాత్రపై కూపీ..

కేసులో మరికొందరిని చేర్చే యోచనలో ఉన్నారు పోలీసులు. వినయ్ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా.. ఆధారాలను సేకరిస్తున్నారు. వినయ్ నడిపే కారు ఓనర్ పాత్ర ఎంత..? అద్దెకు కారు వేస్తే అటువంటి హక్కులు అతనికి ఉన్నాయా లేదా అనే దానిపైన పోలీసులు వెరిఫై చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.