Visakha: గంట కురిసిన వర్షానికే వాగులా మారిన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. కొట్టుకుపోయిన వాహనాలు

|

Sep 20, 2021 | 8:46 AM

విశాఖ అంటే... సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. సుందర నగరంగా, స్మార్ట్ సిటీ గా అందరి మదిలో మెదులుతుంది సాగర నగరం. కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.

Visakha: గంట కురిసిన వర్షానికే వాగులా మారిన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. కొట్టుకుపోయిన వాహనాలు
Visakha
Follow us on

Steel City Rains: విశాఖ అంటే… సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. సుందర నగరంగా, స్మార్ట్ సిటీ గా అందరి మదిలో మెదులుతుంది సాగర నగరం. కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే చినుకు పడితే చాలు వణుకుపుట్టే పరిస్థితి నగరంలోని చాలా చోట్ల కనిపిస్తుంది. ఆదివారం రాత్రి గంట పాటు కురిసిన వర్షానికి నగరంలోని మధురవాడలో హైవే పై నిర్మించిన బ్రిడ్జి కింద రహదారి నదిని తలపించేలా తయారైంది. వరద ప్రవాహం కి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వాహనదారులు కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది.

దీంతో ఆ ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు ఏదో మారుమూల గ్రామాలలోనిదో.. లేదా ఏజెన్సీ ప్రాంతంలోనిదో అనిపించే పరిస్థితి తలెత్తింది. స్మార్ట్ సిటీగా, మెట్రోపాలిటన్ నగరంగా చెప్పుకునే విశాఖపట్నం పరిస్థితి ఇలా ఉంది. అందీ భూముల ధరలు అత్యధిక రేట్లు పలుకుతున్న మధురవాడ ప్రాంతంలో ఈ స్థితి నెలకొంది. మధురవాడ వద్ద హైవే పై నిర్మించిన బ్రిడ్జి కింద పరిస్థితి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడ కాస్త చినుకు పడితే చాలు వణుకు పుడుతుందంటూ వాపోతున్నారు.

ఉన్నది రహదారో, లేక వాగో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని నిట్టూరుస్తున్నారు విశాఖ వాసులు. ఆదివారం రాత్రి ఓ గంట పాటు కురిసిన వర్షానికే ఆ ప్రాంతం అతలాకుతలమైతే, కుండపోత వర్షం కురిస్తే మాపరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. బ్రిడ్జి కింద నుంచి బక్కన్నపాలెం వైపు ప్రయాణం అంటే ప్రాణసంకటంగా మారిందని టీవీ9తో మొరపెట్టుకున్నారు.

కాగా, వర్షపు నీటి ప్రవాహంకి రోడ్డుపై ప్రయాణించే పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వెంటనే స్థానికులు స్పందించి సహకారం అందించడంతో వాహనదారులు సేఫ్ గా బయటపడ్డారు. ఆ ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీ నిర్మాణాలు ఉపందుకున్నాయి. ఆక్రమణల కారణంగా కాలువలు కుసించుకుపోయాయి. దీంతో చిన్నపాటి వర్షం పడిన అక్కడ ప్రయాణం సాహసోపేటంగ మారిపోతుంది.

Read also: ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోని ఎమర్‌ మఠంలో గుప్త నిధుల కోసం మళ్లీ వేట.. మరో విలువైన నిధి ఉందని అధికారుల తవ్వకాలు