అల్లూరి ఏజెన్సీలో ఎన్ని పర్యాటక ప్రాంతాలున్నా.. ఆ వంజంగి మంచు మేఘాల కొండ ప్రత్యేకం. ఆ దృశ్యాలు, కాలికి మేఘాలు తాకుతూ వెళ్తున్నట్టు అనిపించే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ప్రకృతి ఒడిలో ఆ సుందర దృశ్యాలను తిలకించి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తుంటారు జనం. కానీ ఇప్పుడు ఆ ప్రదేశం సందర్శనకు తాత్కాలిక బ్రేక్ పడింది. దింతో ఇక.. చలో అరకు అంటూన్నారు జనం. ఎందుకంటే.. అంతలా కనువిందు చేసే మరో మేఘాల మాడగడ కొండ రారమ్మని పిలుస్తోంది. దింతో అరకుకు విపరీతంగా రద్దీ పెరిగింది.
– ఏజెన్సీలో మనసు దోచే పర్యాటక ప్రాంతాలు ఎన్ని ఉన్నా.. ఒక్కొక్క దానికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ.. ఆ మేఘాల కొండలు.. అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. పర్యాటకుల మనసు దోచేస్తుంది. సందర్శకులను రారా రమ్మని పిలుస్తూ.. తమ ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించమని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో వంజంగి రెండు మేఘాల కొండల ఇప్పుడు ఏజెన్సీ పర్యాటకానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
ఆ బ్రేక్ తో .. మరో చోట క్యూ..!
– అయితే.. వంజంగి మేఘాల కొండ పర్యాటకుల సందరర్సన్కు బ్రేక్ పడింది. తొమ్మిదో తరగతి వరకు సందర్శకుల నో ఎంట్రీ ప్రకటించారు అధికారులు. ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు, రహదారి మరమ్మతుల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు.. పర్యాటకుల కోసం మరికొన్ని సదుపాయాలు ఆ ప్రాంతంలో కనిపిస్తున్నారు. నిత్యం తెల్లవారుజాము వేలాదిమంది వంచంగి మేఘాల కోండకు సందర్శిస్తూ ఉంటారు. అయితే.. అనుమతి నిరాకరించడంతో ఇప్పటికే అక్కడకు చేరుకున్న పర్యాటకులు.. వెనుదిరుగుతున్నరు. అటువంటి వారిని ఆహ్వానిస్టోంది మాడగడ మేఘాల కొండ. వంజంగి నిలిచిపోవడంతో ఇప్పుడు.. అరకు లోయలోని మాడగడకు క్యూకడుతున్నారు జనం.
సూర్యోదయం సీన్ మాములుగా ఉండదు మరి..
– పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండ సందర్శన కు బ్రేక్ పడగానే అరకు లోయలోని మాడగడ మేఘాల కొండలకు రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. మాడగడలో పాల సముద్రాన్ని తలపించేలా పొగ మంచు కమ్ముకుంది. సుందర దృశ్యాలు చూసేందుకు క్యూ కడుతున్నారు జనం. శీతాకాలంలో ఈ దృశ్యాలు నిత్యం దర్శనమిస్తున్న.. వీకెండ్ లో భారీగా అక్కడకు చేరుకుంటున్న పర్యాటకుల మధ్య ఆ ప్రకృతి సుందర దృశ్యాలు చూడడం ప్రత్యేక అనుభూతి. ఇందుకోసం.. సాటర్డే సాయంత్రం నుంచి కాపు కాసేస్తున్నారు. సండే సూర్యోదయాన్నె .. కొండల మధ్య లోయలో పాల సముద్రం లాంటి మేఘాలను చూసి ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. పొగమంచుతో పాటు చల్లనిగాలులు తోడవడంతో ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. కెమెరాల్లో మేఘాలను బంధిస్తూ.. సుందర దృశ్యాలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు.
మేఘాలలో తేలిపోమ్మన్నది..
– ఇదంతా ఒకంత అయితే.. సుదూర ప్రాంతాల నుంచి తమ ఏజెన్సీ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన అతిధుల కోసం.. మాడగడ పై స్థానికులు చేస్తున్న ఏర్పాట్లు సందర్శకుల మనసు దోచేస్తున్నాయి.. ఏకంగా ఒక ఉత్సవ వాతావరణన్నే సిద్ధం చేసేసారు. మేఘాల కొండపై ఉయ్యాల ఏర్పాటు చేశారు. మేఘాలు చూస్తూ ఆ అడవి తల్లి ప్రకృతి ఒడిలో ఉయ్యాల ఊగుతుంటే.. మేఘాలలో తేలిపొమ్మన్నది అన్నట్టు ఉంటుంది. దాంతోపాటు గిరిజన సంస్కృతిని చాటి చెప్పే విధంగా దింసా కళాకారులను అతిధుల కోసం అందుబాటులో పెట్టి నృత్యాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల క్యాంప్ ఫైర్లతో పర్యాటకులు సందడి చేస్తున్నారు.
– ఇక.. ఈ సీజన్లో మాత్రమే కనిపించే ప్రకృతి అందాలను చూసేందుకు వస్తున్న పర్యాటకుల వాహనాలతో అరకు కిక్కిరిసిపోతోంది. ఇక.. వంజంగి మేఘాlaకొండకు వెళ్లి నిరశతో వెనుదిరకకుండా అరకులోని ఆ మాడగడ ప్రకృతి మేఘాల కొండల సుందర దృశ్యాలు ఆహ్వానించండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..