విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం

విశాఖపట్టణంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ వెస్ట్ క్యూ 5 బెర్త్‌లోని కోస్టల్ షిప్పింగ్‌ బోటులో మంటలు వెలువడ్డాయి

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం

Edited By:

Updated on: Aug 09, 2020 | 8:12 PM

Visakha port fire accident: విశాఖపట్టణంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ వెస్ట్ క్యూ 5 బెర్త్‌లోని కోస్టల్ షిప్పింగ్‌ బోటులో మంటలు వెలువడ్డాయి. చెన్నై నుంచి శనివారం వచ్చిన పనామా బిడి 5 నౌకలో ఈ రోజు మధ్యాహ్న సమయంలో పొగలు వచ్చాయి. దాన్ని గమనించిన నౌకా సిబ్బంది, పోర్ట్ అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఇది స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోర్టు ట్రస్ట్‌ యాజమాన్యం తెలిపింది. ఆస్తి నష్టం కూడా జరగలేదని పోర్ట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read This Story Also: కాంగ్రెస్‌కి కొత్త చీఫ్ అవసరం: శశి థరూర్‌