హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. ఈ రోజు ఉదయం నుంచీ వాతావరణం కాస్త మబ్బుగా ఉంది. కాగా భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. ఈ రోజు ఉదయం నుంచీ వాతావరణం కాస్త మబ్బుగా ఉంది. కాగా భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సోమాజిగూడ, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, కోఠి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, మారేడ్ పల్లి, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మియాపూర్‌లలో భారీ వర్షం కురిసింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.
Read More:
స్వర్ణ ప్యాలెస్ ఘటనః మృతుల వివరాలు ఇవే