కరోనా ఎఫెక్ట్: టీటీడీ మరో వినూత్న కార్యక్రమం

| Edited By:

Jul 16, 2020 | 9:47 AM

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో కరోనా నియంత్రణకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

కరోనా ఎఫెక్ట్: టీటీడీ మరో వినూత్న కార్యక్రమం
Follow us on

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో కరోనా నియంత్రణకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుమలకు వెళ్లే ముందే భక్తులందరికి నమూనాలను సేకరించడంతో పాటు బస్సుల్లో కొండ మీదికి వెళ్లే ప్రయాణికులకు టికెట్‌తో పాటు ఓ చీటిని ఇస్తోంది. అందులో వారి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్‌, బస్సు నంబర్‌, సమయం రాసి ఉంచాలి. ఆ చీటీలను అలిపిరి చెక్‌పాయింట్ వద్ద ఆర్టీసీ సిబ్బంది తీసుకుంటున్నారు. ఒకవేళ బస్సులో ప్రయాణించిన ఎవరికైనా వైరస్‌ సోకిందని తేలితే.. అతనితో ప్రయాణించిన వారిని సులువుగా గుర్తించేందుకు అధికారులు ఈ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు.