కరీంనగర్‌‌లో సైకిల్ ర్యాలీ చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ

| Edited By:

Apr 03, 2019 | 5:25 PM

కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. వేములవాడ రాజన్న సన్నిధి నుంచి మొదలైన ఈ యాత్ర కొండగట్టు అంజన్నస్వామి గుడి వరకు కొనసాగుతోంది. కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా గులాబీ దండు సైకిల్ సవారీతో ముందుకు సాగుతోంది. కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. పల్లెపల్లెలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు గులాబీ క్యాడర్. […]

కరీంనగర్‌‌లో సైకిల్ ర్యాలీ చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ
Follow us on

కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. వేములవాడ రాజన్న సన్నిధి నుంచి మొదలైన ఈ యాత్ర కొండగట్టు అంజన్నస్వామి గుడి వరకు కొనసాగుతోంది. కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా గులాబీ దండు సైకిల్ సవారీతో ముందుకు సాగుతోంది.

కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. పల్లెపల్లెలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు గులాబీ క్యాడర్. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ మళ్లీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల సైకిల్ యాత్రకు ఊరూరా మంచి స్పందన కన్పిస్తోంది.