రెండు వంశాల మధ్య వివాదం..ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు

|

Feb 12, 2020 | 8:34 PM

ఇది కంప్యూటర్‌ యుగం..మనిషి చంద్రమండలంపై ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్న కాలం. అత్యాధునీక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి తరంలోనూ మనిషిని మూఢనమ్మకాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆధునిక యుగంలో ఆదివాసీ కొలాం గిరిజనులు ఇంకా మూఢనమ్మకాలను పాటిస్తూ…వివాదాలతో విషం చిమ్ముకుంటున్నారు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలో రెండు ఆదివాసీ తెగల కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. కుమ్మరి తండా పంచాయతీ పరిధిలో ఉన్న రాముగూడ కొలాంగిరిజన గ్రామంలో నివసిస్తున్న కొలాం గిరిజనుల వంశాల మధ్య […]

రెండు వంశాల మధ్య వివాదం..ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు
Follow us on

ఇది కంప్యూటర్‌ యుగం..మనిషి చంద్రమండలంపై ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్న కాలం. అత్యాధునీక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి తరంలోనూ మనిషిని మూఢనమ్మకాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆధునిక యుగంలో ఆదివాసీ కొలాం గిరిజనులు ఇంకా మూఢనమ్మకాలను పాటిస్తూ…వివాదాలతో విషం చిమ్ముకుంటున్నారు. వివరాల్లోకి వెళితే…

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలో రెండు ఆదివాసీ తెగల కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. కుమ్మరి తండా పంచాయతీ పరిధిలో ఉన్న రాముగూడ కొలాంగిరిజన గ్రామంలో నివసిస్తున్న కొలాం గిరిజనుల వంశాల మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆదివాసీ కొలాం గిరిజన వంశాల మద్య ఏర్పడిన వివాదంతో చివరకు కొలాం వంశీయులు కట్టుబట్టలతో గ్రామం ఖాళీ చేసివెళ్లారు.

ఆత్రం వంశానికి చెందిన కొలాం గిరిజనులతో కొడప వంశానికి చెందిన కొలాంల మధ్య వివాదం ఏర్పడింది. ప్రతి ఏడాది కొడప వంశస్తులు తమ భీమ దేవరకు గ్రామం తూర్పున ఉన్న మందిరంలో పూజలు చేయడం ఆనవాయితీ. ఇది ఆత్రం కొలాం గిరిజనులకు నచ్చలేదు. తూర్పు వైపు పూజలు చేయడం సరికాదని తాము చేస్తున్నట్లు భీమా దేవర పూజలను పడమరవైపు చేయాలని కొడప వంశానికి చెందిన రాంచందర్‌కు సూచించారు. మీరు చేసింది తప్పని అందుకు గానూ జరిమానా చెల్లించాలని హెచ్చరించారు. 21 వేలు జరిమానా చెల్లిస్తేనే గ్రామంలో ఉండాలని హుకుం జారీ చేశారంటూ రాంచందర్‌ వాపోయాడు.

దేవతల విషయంలో రెండు వంశాల మధ్య తలెత్తిన వివాదంలో ఈ నెల 2న మొదటి సారి పంచాయతీ నిర్వహించారు. రాంచందర్‌ జరిమానా చెల్లించిన తర్వాత ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. తిరిగి ఈ నెల 9న రెండో సారి జిల్లాలోని ఆది వాసీ కొలాం పెద్దలు పంచాయతీలు పెట్టారు. రాంచందర్‌ చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేసి, తమను గ్రామం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు. అందుకోసం అతడు ఇష్టాపూర్వకంగానే గ్రామం ఖాళీచేస్తున్నట్లుగా అంగీకార పత్రం రాయించుకున్నారని బాధిత వంశస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఊరు ఖాళీ చేసిన రాంచందర్‌ వెంట మరో 19 కుటుంబాలు గ్రామాన్ని వీడి ఎందా సమీపంలోని వంజరి గూడలో తాత్కాలిక డేరాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు.

విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం భుజంగ్‌రావు గ్రామాన్ని సందర్శించారు. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదాల గురించి ఆరా తీశారు. మూఢనమ్మకాలతో జీవిస్తున్న కోలాం ఆది వాసీ గిరిజనులను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. వారికి సరైన విద్య, సామాజిక అవగాహన కల్పించాల్సిన బాద్యత ఐటీడీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులపైనే ఉందన్నారు.