ఆధునికీకరణ పనులతో రేపు, ఎల్లుండి కొన్ని రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే(East Coast Railway) పరిధిలో పనుల నేపథ్యంలో 4, 5 తేదీల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్(Walther Division) అధికారులు వెల్లడించారు. ఈ మార్పును ప్రయాణీకులు గమనించాలని, సహకరించాలని కోరారు. 18301-18302 నంబర్ గల సంబల్‌పూర్-రాయగడ-సంబల్‌పూర్, 22820-22819 విశాఖపట్నం-భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్ సిటీ, 18532-18531 నంబర్ గల విశాఖపట్నం-పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం – కోరాపుట్-విశాఖపట్నం 08546-08545, 18417-18418 నంబర్ గల పూరి – గుణుపూర్ – పూరి రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా సంబల్‌పూర్ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దైన పలు రైళ్లను వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పునరుద్ధరించనున్నట్లు వివరించారు.
మరోవైపు.. 07193 నంబర్ గల ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి జూన్ 04, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. 07194 నంబర్ గల ప్రత్యేక రైలు జూన్ 05, 12, 19, 26 తేదీల్లో రాత్రి 08.45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09.30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి