కూరగాయల వ్యాపారి ద్వారా 26 మందికి కరోనా..!

| Edited By:

Jun 02, 2020 | 4:04 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని గోరంట్లలో ఓ కూరగాయాల వ్యాపారి ద్వారా 26 మందికి కరోనా సోకింది.

కూరగాయల వ్యాపారి ద్వారా 26 మందికి కరోనా..!
Follow us on

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని గోరంట్లలో ఓ కూరగాయాల వ్యాపారి ద్వారా 26 మందికి కరోనా సోకింది. ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురికి, పక్కింట్లో ఇద్దరికి, మరో 18 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మార్కెట్‌లోని అన్ని దుకాణాలను మూసేసిన అధికారులు ఆ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మరికొంతమందికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు పడ్డారు. అనుమానితుల్ని క్వారంటైన్‌కు తరలించే పనిలో పడ్డారు. అయితే కూరగాయల వ్యాపారికి కరోనా రావడంతో స్థానికంగా అలజడి రేగింది.

మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3200కు చేరింది. అందులో 2209 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 64 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో 112 మంది కరోనా నిర్ధారణ కాగా.. అందులో ఒకరు కోలుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 479 మందికి కరోనా రాగా.. 282 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Read This Story Also: ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!