ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!

”టీడీపీలోకి ఎన్టీఆర్‌ ఎంట్రీ”.. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి అప్పగించాలంటూ కార్యకర్తలు, అభిమానుల నుంచి బలంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలోని పలువురు మాత్రం ఎన్టీఆర్,‌ టీడీపీకి అవసరం లేదంటూ బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఇక బాలయ్య ఇద్దరు అల్లుళ్లు కూడా పార్టీలోకి ఎన్టీఆర్ రాకపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”టీడీపీ ఎవరో ఒక్కరి సొత్తు కాదు. ఇక్కడంతా […]

ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 3:52 PM

”టీడీపీలోకి ఎన్టీఆర్‌ ఎంట్రీ”.. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి అప్పగించాలంటూ కార్యకర్తలు, అభిమానుల నుంచి బలంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలోని పలువురు మాత్రం ఎన్టీఆర్,‌ టీడీపీకి అవసరం లేదంటూ బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఇక బాలయ్య ఇద్దరు అల్లుళ్లు కూడా పార్టీలోకి ఎన్టీఆర్ రాకపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.

”టీడీపీ ఎవరో ఒక్కరి సొత్తు కాదు. ఇక్కడంతా పార్టీ కోసం పని చేసేవాళ్లే ఉన్నారు. ఎవరైనా వచ్చి పని చేయొచ్చు. జూనియర్ కూడా దీనికి మినహాయింపు కాదు” అని పెద్దల్లుడు నారా లోకేష్ కామెంట్లు చేయగా.. ”ప్రస్తుతం పార్టీ కోసం పని చేయడానికి మేమంతా ఉన్నాం. ఇప్పటికప్పుడు జూనియర్ రావాల్సినంత అవసరం పార్టీకి లేదని” చిన్నల్లుడు శ్రీభరత్ అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది అది వేరే విషయం.

ఇదిలా ఉంటే రాను రాను తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గడ్డుకాలం గడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలోకి ఎన్టీఆర్‌ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాటికి బలం చేకూరుస్తూ ఎన్టీఆర్‌ పొలిటికల్ ఎంట్రీ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

”ఎన్టీఆర్‌ టీడీపీలోకి రావొచ్చు. నేను ఎమ్మెల్యేగా చేస్తూ సినిమాలు చేస్తున్నా. నాన్న కూడా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌కి చాలా కెరీర్ ఉంది. ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం అది అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది” అని బాలయ్య అన్నారు. దీంతో ఎన్టీఆర్‌ని టీడీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మరి రాజకీయాల్లోకి ప్రవేశంపై ఎన్టీఆర్ మనసులో ఏముంది..? ఆయన టీడీపీలోకి వస్తారా..? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: ‘లవకుశ’ కథ వివాదం.. టీటీడీపై విమర్శలు..!