పదో తరగతి పరీక్షలు.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష సెంటర్‌కు విద్యార్థులు మాస్క్‌లతోనే రావాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష సెంటర్‌కు విద్యార్థులు మాస్క్‌లతోనే రావాలని ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే పరీక్షకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఇక పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారికి ప్రత్యేక గదులు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు బహిరంగ ప్రదేశాలలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. కాగా మార్చి 19తో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 6వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.34లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకానున్నారు. 10వ తరగతి పరీక్ష పేపర్లను ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఈవాల్యూషన్ చేయనున్నారు.
Read This Story Also: యంగ్ డైరక్టర్‌కు బంపరాఫర్.. మహేష్ నుంచి పిలుపు..!