తెలంగాణ అల‌ర్ట్ః ఓ వైపు క‌రోనా ఉధృతి…మ‌రోవైపు దూసుకొస్తున్న..

|

Jun 12, 2020 | 8:37 PM

గ‌తనెలలో మూడువిడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు వచ్చాయి. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి తీవ్ర నష్టం కలిగించవచ్చని భావించినా.. అవి రాష్ట్రంవైపు రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ,

తెలంగాణ అల‌ర్ట్ః ఓ వైపు క‌రోనా ఉధృతి...మ‌రోవైపు దూసుకొస్తున్న..
Follow us on

గ‌తనెలలో మూడువిడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు వచ్చాయి. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి తీవ్ర నష్టం కలిగించవచ్చని భావించినా.. అవి రాష్ట్రంవైపు రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, తాజాగా తెలంగాణ‌కు 200 కిలోమీటర్ల దూరంలో మరో దండు ప్రమాదం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మిడతల కదలికలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ మేర‌కు ఆయా జిల్లాల అధికార‌యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి గత నెలలోనే ప్రవేశించిన మిడతల దండు… తాజాగా తెలంగాణలోకి ప్రవేశించిందని క‌మిటీ ప్ర‌క‌టించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయ‌ని చెప్పారు. పెద్దంపేట గోదావరి పరివాహక ప్రాంతంలో చెట్ల ఆకులను నమిలేస్తున్నాయి. దీంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తమ పంట పొలాలను నాశనం చేస్తాయని భయపడుతున్నారు.  అక్కడి నుంచి అవి ఎటువైపు వెళ్తాయనే ఆందోళన నెలకొంది.

 కాగా, రెండు రోజుల క్రిత‌మే మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.  కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.