చంద్రబాబు సమక్షంలోనే.. కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

కడప జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే కొట్టుకున్నారు. మంగళవారం కడప నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు సమీక్ష నిర్వహించగా.. అందులో దళిత కార్యకర్తలు తమ సమస్యలను ఆయనకు చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నాడని కొండా సుబ్బయ్య అనే వ్యక్తి బాబుకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన మనుషులు అతడిపై దాడికి దిగి.. తీవ్రంగా కొట్టారు. దీంతో సభ కాస్త […]

చంద్రబాబు సమక్షంలోనే.. కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

Edited By:

Updated on: Nov 27, 2019 | 11:53 AM

కడప జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే కొట్టుకున్నారు. మంగళవారం కడప నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు సమీక్ష నిర్వహించగా.. అందులో దళిత కార్యకర్తలు తమ సమస్యలను ఆయనకు చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నాడని కొండా సుబ్బయ్య అనే వ్యక్తి బాబుకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన మనుషులు అతడిపై దాడికి దిగి.. తీవ్రంగా కొట్టారు. దీంతో సభ కాస్త రసాభాసగా మారింది. అయితే అధినేత చంద్రబాబు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోకపోవడం గమనార్హం.