Andhra Pradesh: బ్యూటిషియన్ కు కానిస్టేబుల్ వేధింపులు.. కట్ చేస్తే..!

| Edited By: Jyothi Gadda

Jan 01, 2024 | 5:26 PM

ఈ ఇష్యూ పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులకు.. తన కుటుంబం పరువు పోకుండా కాపాడాలని సదరు బాధితురాలు కోరినట్టుగా పోలీసులు చెప్పారు. కేసు విషయం పక్కన పెడితే.. ఆ కానిస్టేబుల్ నుంచి తనకు రక్షణ కల్పించాలని.. బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో విచారణకు ఆదేశించారు సిపి. విచారణలో బ్యూటీషియన్, బొటిక్ నిర్వహకురాలిగా ఉన్న యువతిని కానిస్టేబుల్ వేధిస్తున్నట్టు గుర్తించి..

Andhra Pradesh: బ్యూటిషియన్ కు కానిస్టేబుల్ వేధింపులు.. కట్ చేస్తే..!
Suspension of Crime Constable
Follow us on

ఆంధ్రప్రదేశ్, జనవరి 01; విశాఖలో ఓ క్రైమ్ కానిస్టేబుల్ పై వేటు పడింది. సస్పెన్షన్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు.  బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న ఓ యువతిని ట్రాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు అన్న అభియోగంపై అంతర్గత విచారణకు ఆదేశించారు సిపి. విచారణలో క్రైమ్ కానిస్టేబుల్ పాత్ర వెలుగులోకి వచ్చింది.  పోలీసు వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. వై రాము అనే కానిస్టేబుల్.. న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయమైంది. తాను కానిస్టేబుల్ అని, తనకు పెళ్లి కాలేదని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. అది కాస్తా ఇద్దరి సన్నిహితనికి దారి తీసింది. గత ఏడాది ఏప్రిల్ లో ఫేస్ బుక్  ద్వారా పరిచయమైన ఆ యువతి.. కానిస్టేబుల్ మాటలు తన వలలో పడింది. ఫోన్ లో చిట్ చాట్ తో దగ్గర అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అప్పటికే క్రైమ్ కానిస్టేబుల్ రాముకు వివాహమైంది. కుటుంబం కూడా ఉంది. ఈ విషయం ఆ యువతకి ఆలస్యంగా తెలిసింది. అవాక్కయిన ఆ యువతి.. తనతో అబద్ధం చెప్పినట్టు తెలుసుకొని కానిస్టేబుల్ ను దూరం పెట్టింది.

ఆ విధంగా టార్చర్..

అప్పటి నుంచి ఆమెకు టార్చర్ మొదలైంది. మానసికంగా శారీరకంగా తీవ్ర వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా.. యువతి పేరెంట్స్ కు కాల్ చేసి హరాస్మెంట్ చేసేవాడు. ఇంటికి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు కానిస్టేబుల్ రాము. బయటకు చెబితే తన కుటుంబం పరువు బయటపడుతుందని, కానిస్టేబుల్ కావడంతో న్యాయం జరుగుతుందో లేదో అన్న భయం ఆమెను వెంటాడింది. దీంతో కొన్ని రోజులపాటు తీవ్ర మానసిక వేదనకు గురైంది బాధితురాలు. వాడి ప్రవర్తనలో మార్పు రాకపోవడం, వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఇక టార్చర్ తట్టుకోలేని ఆ యువతి .. ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించింది.

ఇవి కూడా చదవండి

కానిస్టేబుల్ సస్పెన్షన్..

ఈ ఇష్యూ పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులకు.. తన కుటుంబం పరువు పోకుండా కాపాడాలని సదరు బాధితురాలు కోరినట్టుగా పోలీసులు చెప్పారు. కేసు విషయం పక్కన పెడితే.. ఆ కానిస్టేబుల్ నుంచి తనకు రక్షణ కల్పించాలని.. బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో విచారణకు ఆదేశించారు సిపి. విచారణలో బ్యూటీషియన్, బొటిక్ నిర్వహకురాలిగా ఉన్న యువతిని కానిస్టేబుల్ వేధిస్తున్నట్టు గుర్తించి.. సి పి కి నివేదికను సమర్పించారు. దీంతో క్రైమ్ కానిస్టేబుల్ రాము పై సస్పెన్షన్ వేటు వేశారు సిపి రవిశంకర్ అయ్యనార్. 811/2023 డివో నెంబర్ తో సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగే వరకు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళొద్దని సూచనలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..