నిమ్మగడ్డ కేసు విచారణ..స్టేకు ‘సుప్రీం’ నిరాకరణ

ఏపీ ఎస్‌ఈసీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్..

నిమ్మగడ్డ కేసు విచారణ..స్టేకు సుప్రీం నిరాకరణ

Edited By:

Updated on: Jun 10, 2020 | 2:02 PM

ఏపీ ఎస్‌ఈసీ కేసుపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీం నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. రెండు వారాల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవులతో ఆటలాడుకోవద్దని.. ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలు నమ్మదగినవిగా లేవని సీజేఐ వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.