ఇవాళ, రేపు పలుచోట్ల చిరుజల్లులు..!

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణమధ్య మహారాష్ట్ర నుంచి కామెరూన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో వర్షాలు పడొచ్చని అధికారులు అన్నారు. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉందని.. పగటి సమయంలో మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతుందని అన్నారు.

ఇవాళ, రేపు పలుచోట్ల చిరుజల్లులు..!

Edited By:

Updated on: May 17, 2019 | 10:37 AM