AP Train Accident: నుజ్జునుజ్జైన ఆ రైళ్లు మూడు రోజుల్లోనే మళ్లీ ట్రాక్‌పైకి

ప్రమాదం జరిగిన వెంటనే ఈస్ట్ కోస్ట్ రైల్వే అత్యంత వేగంగానే స్పందించింది. ముందు వెళ్తున్న ట్రైన్ ని వెనకవైపు నుంచి వచ్చిన ట్రైన్ వేగంగా గుద్దడంతో.. ముందు ఉన్న ట్రైన్ బోగిల పైకి వెనకాల ఉన్న ట్రైన్ బోగీలు ఎక్కడం, ఈ క్రమంలో భోగీలు తుక్కుతుక్కుగా మారాయి.  ప్రమాదం జరిగింది రాత్రి 7 గంటల సమయం కావడంతో..

AP Train Accident: నుజ్జునుజ్జైన ఆ రైళ్లు మూడు రోజుల్లోనే మళ్లీ ట్రాక్‌పైకి
Train Accident

Edited By:

Updated on: Nov 03, 2023 | 6:04 PM

ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో గత ఐదునెలల కాలంలో రెండో అతిపెద్ద ప్రమాదం అక్టోబరు 29న విజయనగరం జిల్లాలో జరిగింది.  ఆరోజు రాత్రి 7 గంటల సమయంలో అలమంద – కంటకాపాల్లి మధ్య ఆగివున్న విశాఖ-పలాస ట్రైన్ ను అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ – రాయగడ రైలు ఓవర్ షూట్ చేయడం, ఆ ప్రమాదం లో 13 మంది మృతి చెందడం, 35 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడినవారు చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఈస్ట్ కోస్ట్ రైల్వే అత్యంత వేగంగానే స్పందించింది. ముందు వెళ్తున్న ట్రైన్ ని వెనకవైపు నుంచి వచ్చిన ట్రైన్ వేగంగా గుద్దడంతో.. ముందు ఉన్న ట్రైన్ బోగిల పైకి వెనకాల ఉన్న ట్రైన్ బోగీలు ఎక్కడం, ఈ క్రమంలో భోగీలు తుక్కుతుక్కుగా మారాయి.  ప్రమాదం జరిగింది రాత్రి 7 గంటల సమయం కావడంతో.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో రెస్క్యూ చేయడం కూడా పెద్ద టాస్క్ అయింది. అయినప్పటికీ నెక్ట్స్ డే తెల్లవారుజాము నుంచే రెస్క్యూ పనులను ప్రారంభించి మధ్యాహ్నం మూడు గంటలకల్లా ట్రాక్‌ను పునరుద్దరించారు. కేవలం 20 గంటల్లోనే నుజ్జునుజ్జుగా మారిన భోగిలను తొలగించడం, ట్రాక్ ని సరి చేయడం, విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించడం, మిగతా ఆటో సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు ఇంజనీరింగ్ పనులను పూర్తి చేశారు.  రెండు ట్రాక్‌లను యుద్ద ప్రాతిపదికన సిద్ధం చేసింది రైల్వే శాఖ. అదే సమయంలో క్షతగాత్రులని హాస్పిటల్ కు తరలించడం, మృతి చెందిన వారికి నష్టపరిహారం చెల్లించడం వంటి మిగతా సమన్వయ కార్యక్రమాలు అన్నింటిని కూడా వేగంగానే పూర్తి చేశారు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు.

మూడు రోజుల్లోనే రైళ్ల రాకపోకలు పునరుద్దరణ

అయితే ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకొని రెస్క్యూ ఆపరేషన్ కూడా వేగంగా పూర్తి చేసిన రైల్వే శాఖ అధికారులు ప్రమాదానికి గురైన రైలు స్థానంలో కొత్త రైళ్ళను పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరగ్గా బుధవారం రాయగడ ప్యాసింజర్ రైలును పునరుద్ధరించారు. వెంటనే తరువాతి రోజే గురువారం నుంచి విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు సేవలు పునరుద్ధరించబడ్డాయి.

మూడు రోజుల్లోనే ప్రమాదానికి గురైన రైళ్ల స్థానంలో వేరే ఇంజన్లతో వాటిని పునరుద్ధరించిన వాల్తేరు రైల్వే డివిజన్ రోజువారీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కువ ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న స్టాక్‌తో రైళ్లను నడపడానికి చొరవ తీసుకున్నారు. దీనిపై డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ టీవీ 9 తో మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, కానీ ప్రమాదం జరిగిన వెంటేనే రెస్క్యూ చేయడం, బాధితులకు పరిహారం, క్షతగాత్రులను తక్షణమే హాస్పిటల్‌కు తరలించడం, ప్రమాదానికి గురైన వాటి స్థానంలో ప్రత్యామ్నాయ రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేయడం చేశామన్నార.

కొనసాగుతున్న విచారణ

రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రణ్జీవ్ సక్సేనా ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకు విశాఖలోనే ఉండి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. బుధ, గురు వారాలలో రెండో రోజుల పాటు సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన బృందం విచారణ చేపట్టింది. ఈ రెండు రోజులు ప్రధానంగా లోకో పైలట్లు, గార్డులు, ఇంజనీరింగ్, మైయింట్నెస్, సిగ్నలింగ్, సమాచార, సాంకేతిక సిబ్బందితో సహా 150 మంది సిబ్బందితో విచారణ బృందం మాట్లాడి పలు విషయాలను రాబట్టింది. ప్రమాదానికి గురైన రైళ్లలో సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న గూడ్స్ సిబ్బంది, సమీప స్టేషన్ ల సిబ్బందిని విచారించింది సేఫ్టీ కమిషన్.

నివేదికను మరో వారంలో పూర్తి చేసి రైల్వే బోర్డ్ కు సమర్పించనుంది సేఫ్టీ కమిషన్. అనంతరం ప్రమాదానికి కారణాలను బహిర్గతం చేయనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…